డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్నాడు. టెంపర్ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని అతని రేంజ్ కు తగిన ఫలితాలను అందుకోవడంలో మాత్రం పూరి వెనుకపడి ఉన్నాడు. తనయుడితో మెహబూబా అంటూ ప్రయోగం చేసినా ఫలితం లేకపోయేసరికి సైలెంట్ అయ్యాడు పూరి. ప్రస్తుతం ఓ క్రేజీ కథని సిద్ధం చేశాడని తెలుస్తుంది.
ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడని అంటున్నారు. యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దేవరకొండ విజయ్ తో పూరి సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. వైజాగ్ జగదాంబ సెంటర్ బ్యాక్ డ్రాప్ తో ఈ కథ ఉంటుందట. మరోసారి పూరి మార్క్ స్టోరీ లైన్ తో విజయ్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాకు టైటిల్ గా పోరంబోకు అని పెట్టబోతున్నారట.
మహేష్ తో పోకిరి అని తీశాడు ఓకే కాని పోరంబోకు అంటే కచ్చితంగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నట్టే. టైటిల్ విషయంలో పూరి, విజయ్ మరోసారి ఆలోచిస్తే బెటర్. లేదంటే ఉన్న ఇమేజ్ కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.