ఒకే కోటలో 4 వేల కుటుంబాలు.. ఎక్కడంటే?

-

సాధారణంగా కోట అంటే మనకు గుర్తొచ్చే విషయాలు రాజులు పరిపాలన. కానీ ప్రస్తుతం ఈ కోటలను ఒక పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారు. మరికొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్ హోటల్ గా మార్చారు. మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కానీ ఒక వింతైన ఘటన ఏమిటంటే కోటలో ఏకంగా నాలుగు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి ఇంతకీ ఆ కోట ఎక్కడ? ఆ కోట విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో రాజస్థాన్ లోని పురాతన నగరం జైసల్మేర్ గొప్ప వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. దానిలో దేవాలయాలు, కోటలు, రాజభవనాలు మొదలైనవాటితో ప్రతిబింబిస్తుంది. అలాంటి అద్భుతమైన ప్రదేశం ఈ జైసల్మేర్ కోట. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ కోటను గోల్డెన్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. క్రీస్తు శకం 1156లో అప్పటి రాజు రావల్ జైశ్వాల్ ఈ కోటను నిర్మించారు.

ఇంతటి ప్రసిద్ధి చెందిన కోటలో ప్రస్తుతం జనాలు నివసిస్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు ఆ కోట చాలా నిర్మానుష్యంగా ఉండేది. సిల్క్ వ్యాపారం చేసుకునే వర్తకులతో పాటు, టీ పొడి మసాలా దినుసులు, విలువైన రాళ్లను అమ్ముకునే వ్యాపారులు ఇక్కడ బస చేసేవారు. దాంతో ఆ ప్రాంతం క్రమంగా రద్దీగా మారిపోయింది. క్రమక్రమంగా జనాలు ఆ కోటలోనే నివాసం ఉండటం మొదలు పెట్టారు.

ఈ కోట సుమారు 250 అడుగుల ఎత్తు ఇరవై ఐదు అంతస్తుల ఎత్తులో ఉన్న కొండపై దీన్ని నిర్మించారు. ఈ కోటకు మొత్తం 99 బురుజులు ఉన్నాయి. పసుపు రంగులో ఉండే సాండ్ స్టోన్ తో ఈ కోటను నిర్మించడం వల్ల ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. ఈ కోటలో నాలుగు వేల కుటుంబాలకు పైన నివసిస్తున్నారు. తూర్పు నుండి కోటలోకి ప్రవేశించేటప్పుడు వీదిలో వివిధ రకాల విషయాలను చూస్తారు. ఇది సెంట్రల్ మార్కెట్ స్క్వేర్ ఇంకా సూర్యాస్తమయ వీక్షణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రదర్శనలో ఉన్న వస్తువులలో హస్తకళలు, ట్రేడ్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news