పేరుకే యాచకుడు.. దానం చెయ్యడంలో మహారాజే..

-

ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా ఇచ్చేదాన్ని దానం అంటారు..వస్తు, డబ్బు, భూమి, ఆహారపదార్ధాలు సహా అనేక రకాల దానాలు ఉన్నాయి. ఆకలితో ఉన్న వ్యక్తికీ పిడికెడు అన్నం దానం చేసినా ఆ వ్యక్తి జీవితం ధన్యం. క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. అలా దానం చేసేవ్యక్తిని దాత అని కీర్తిస్తుంటారు. దానం ఇవ్వమని అడిగే వ్యక్తిని యాచకులు అంటారు. అయితే తన జీవితాన్ని గడపడానికి భిక్షాటన చేస్తూ ఆర్జిస్తున్న ఓ వ్యక్తి.. తన భవిష్యత్ కోసం ఆలోచించకుండా తన సంపాదనలో కొంత మొత్తాన్ని దానం చేసి తన మంచి మనసుని చాటుకున్నాడు..

వివరాల్లొకి వెళితే..ఉత్తరప్రదేశ్‌కు చెందిన పురంధర్‌ 14 ఏళ్ల క్రితం విశాఖ నగరానికి వలస వచ్చాడు. అప్పటి నుంచి నగరంలోని నక్కవానిపాలెం ఉన్న ప్రముఖ దేవాలయం ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఆలయం వెనుక ఉన్న స్నానాల గదినే నివాసంగా మార్చుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. తన దుస్తులతో పాటు తాను యాచించి సంపాదించిన నగదును కూడా ఆ బాత్ రూమ్ లోనే దాస్తుంటాడు. అయితే ఇటీవల ఆలయ పూజారి బాత్ రూమ్ లో ఉన్న పురంధర్‌ బట్టలను ఇతర సామాగ్రిని బయటకు విసిరేశాడు.

అయితే మూటలో ఉన్న నగదు చెల్లాచెదురుగా పడిపోయింది. అలా చెల్లాచెదురుగా పడిన డబ్బులను, చిల్లరను చూసి పూజారి సహా అక్కడ ఉన్నవారు షాక్ తిన్నారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు..దాని గురించి ఆరా తీయగా అది మొత్తం బిక్షాటన చేసిన సొమ్మే అని తేలింది..మొత్తాన్ని లెక్కించగా లక్ష రూపాయలకు పైగానే ఉంది. దీంతో పురంధర్‌ అందులోని సగం సొమ్మును స్వామి వారికి విరాళంగా సమర్పించుకున్నాడు. రూ. 50 వేల విలువైన నాణేలను హుండీలో వేశారు..అది పదిమందికి ఉపయోగించండని చెప్పడం విశేషం..ఇతను చేసిన పనికి అందరు షాక్ అవ్వడంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు.. గ్రేట్ కదా..

Read more RELATED
Recommended to you

Latest news