22 అడుగుల పామును భుజానేసుకున్న వ్యక్తి.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతీ రోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వైరలవుతూనే ఉంటుంది. నెటిజన్లు వైరలవుతున్న వీడియోనూ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఇంకా వైరల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాగా, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అనే విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాలంతే..

snake

సాధారణంగా పామును చూస్తే చాలు భయపడిపోతుంటాం. అదే పాము మన మీదకు వచ్చి భుజం మీద ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. చాలా భయమేస్తుంది కదా.. కాగా, 22 అడుగులున్న పైతాన్ (కొండ చిలువ) భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్లాడు ఓ వ్యక్తి. వివరాల్లోకెళితే.. జే బ్రుయర్ అనే జూ కీపర్ ఇన్ స్టా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు. తన జూలో పొడవైన కొండ చిలువను ఉంచడానికి తీసుకెళ్లిన క్రమంలో ఎవరూ హెల్ప్ చేసేందుకు లేకపోవడంతో తానొక్కడినే పైతాన్‌ను భుజం మీద వేసుకుని మోసుకెళ్లాలని పేర్కొన్నాడు బ్రుయర్. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది.

నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో ఉన్న కొండచిలువను చూసి అది చిన్నపిల్లల వ్యక్తి భుజనా ఉండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, జే బ్రుయర్ గతంలోనూ ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయగా అవి కూడా నెట్టింట సందడి చేశాయి. ఈ సారి కొండ చిలువను భుజానికేసుకుని వెళ్తున్న వీడియోను షేర్ చేయగా, అది ఫుల్ ట్రెండవుతోంది. సాధారణంగా జనాలు పామును చూస్తేనే భయపడిపోతుండటం కామన్. కాగా, ఇక పైతాన్‌ను చూస్తే ఇంకా భయపడిపోతారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే, జూలో ఉండే నిర్వాహకులు, కీపర్స్ రెప్టైల్స్, స్నేక్స్‌ను డీల్ చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటారని, పలు టెక్నిక్స్ ఉపయోగించే వాటిని హ్యాండిల్ చేస్తారని, అందుకే వాటిని అవి ఏం చేయబోవని చెప్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)