టీచర్ పోస్తుల పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టీచర్ల హేతుబద్ధీకరణ కు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే రాష్ట్రంలో ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా కాళీలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రతి పాఠశాలలో కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండేలా నిబంధనలను రూపొందించింది. ఈ నిర్ణయం తో 0 నుండి 19 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఎస్జిటి పోస్టు ఉండనుంది.
దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేస్తారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపింది. హేతుబద్ధీకరణ అంతరం ఖాళీలను బట్టి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే త్వరలో టీచర్ పోస్టుల భర్తీ ఉండబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిరుద్యోగులు మాత్రం ఇది కేవలం హుజురాబాద్ ఎలక్షన్ డ్రామా అని భావిస్తున్నారు.