సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం.. అంతా క‌రోనా ఎఫెక్ట్‌..

-

ఈ మాయ‌దారి క‌రోనా వచ్చిన త‌ర్వాత ఎవ‌రి జీవితం కూడా అంత ఆశాజ‌న‌కంగా లేద‌నే చెప్పాలి. ఇక దీని ఎఫెక్ట్ ప‌డ‌ని రంగ‌మే లేదు. ఎందుకంటే ప్ర‌తి విభాగాన్ని ఇది కుదిపేస్తోంది. సినిమాల ద‌గ్గ‌రి నుంచి చిన్న కారు రైతుల వ‌ర‌కు అంతా దీని ఎఫెక్ట్‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇంకా కొన్ని రంగాల్లో అయితే మాత్రం దీని ఎఫెక్ట్‌తో కొత్త కొత్త రూల్స్ వ‌స్తున్నాయి. గ‌త చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌న‌న్ని వింత‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఇప్పుఏడు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో కూడా క‌రోనా కొత్త ప్ర‌భావం చూపింది.

సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్న‌డూ లేని విధంగా ఈరోజు ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తుల‌తో ప్రమాణ స్వీకారం చేయించారంటే దీని ప్ర‌భావం ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అంతే కా సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ కూడా చాలా మార్పులు చేయించారు ఈ ప్ర‌మాణ స్వీకారం కోసం. వాస్త‌వానికి కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల ఒకటో నెంబర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు అదనపు బిల్డింగ్ సముదాయంలో ఉండే ఆడిటోరియానికి ఈ ప్రోగ్రామ్‌ను మార్చారు ఆయ‌న‌. నిజానికి అయితే వీరి ప్రమాణ స్వీకారం ఒక‌టో నెంబ‌ర్ కోర్టులోనే జ‌రిగి ఉండేద‌ని చెబుతున్నారు.

ఇలా జ‌ర‌గ‌డం సుప్రీంకోర్టు చరిత్రలోనే మొద‌టి సారి అని వివ‌రిస్తున్నారు. ఇక కొత్త‌గా సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా అభయ్ శ్రీనివాస్ ఓకా తోపాటు విక్రమ్ నాథ్, జితేంద్ర కుమార్ మహేశ్వరి అలాగే తెలంగాణ హైకోర్టు మాజీ సీజే అయిన హిమా కోహ్లీ కూడా ఇందులో కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఇంకా కొంద‌రు ప్ర‌మాణ స్వీకారం చేయించారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, మొత్తం తొమ్మిది మందిని సీజేఐ నేతృత్వంలోని కొలీజియం జ‌డ్జిలుగా నియ‌మించింది. దీంతో వారంతా ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. మొత్తానికి క‌ర‌నా ఈ విధంగా ఎఫెక్ట్ చూపింద‌న్న మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news