30 ఏళ్లుగా శవంతో రిలేషన్‌లో ఉన్న యువకుడు.. సీన్‌ కట్‌ చేస్తే అదిరిపోయే ట్విస్ట్..

-

ప్రేమకు వయసుతో సంబంధం లేదు..జండర్‌తో సంబంధం లేదు అని అందరూ అంటుంటారు.. దీనికి తగ్గట్టుగానే చాలా ప్రేమ కథలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.. పాతికేళ్ల అమ్మాయి యాభై ఏళ్ల తాతను పెళ్లి చేసుకుందని, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు ఇలా.. ఇది కూడా అలాంటిదే కానీ.. అంతకు మించి.. వాళ్లంతా వయసు, జండర్‌లోనే తేడాగా చేసుకున్నారు..ఈ అబ్బాయి మాత్రం ఏకంగా మమ్మీనే లవర్‌ చేసుకున్నాడు.. మమ్మీ అంటే అమ్మ అనుకునేరు.. ఈజిప్ట్‌ మమ్మీ.. 600-800 సంవత్సరాల క్రితం నాటి మమ్మీని తన గర్ల్‌ఫ్రెండ్‌గా చేసుకున్నాడు. 30 ఏళ్లగా ఆ మమ్మీతోనే ఉంటున్నాడట.. సీన్‌ కట్‌ చేస్తే..

పెరులోని ఓ డెలివరీ బాయ్‌ లవ్‌లో పడ్డాడు. గర్ల్‌ఫ్రెండ్‌ని విడిచి పెట్టి ఉండలేక ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. 600-800 సంవత్సరాల క్రితం నాటి మమ్మీని తన గర్ల్‌ఫ్రెండ్‌గా చేసుకున్నాడు. 30 ఏళ్ల నుంచి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. మరి ఇన్నేళ్ల నుంచి మమ్మీని ఎలా ప్రిజర్వ్ చేశాడు అనే కదా మీ డౌట్‌.. ఐసో థర్మల్ బ్యాగ్‌లో పెట్టాడట. 26 ఏళ్ల జూలియోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు. ఎందుకిలా చేశారు..? అని లోకల్ మీడియా జూలియోను ప్రశ్నించగా…”తను నాకు స్పిరిచ్యుయల్ గర్ల్‌ఫ్రెండ్” అంటూ ఏదేదో చెప్తున్నాడు..

ఇన్నేళ్లుగా కలిసే జీవించాం. నా రూమ్‌లోనే తనకు చోటిచ్చాను. నాతోనే రోజూ నిద్రించేది. నేను తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. 30 ఏళ్ల క్రితం మా నాన్న ఈ మమ్మీని ఇంటికి తీసుకొచ్చాడని జూలియో అంటున్నాడు.

హైలెట్‌ ఇదే..

జూలియే తెచ్చుకున్న మమ్మీ అమ్మాయి కాదట.. అబ్బాయట.. మనోడు ముప్పై ఏళ్లుగా ఆ మమ్మీనే గర్ల్‌ఫ్రెండ్‌గా భావించాడు.. ఆ మమ్మీ పురుషుడిదేనని తేల్చి చెప్పారు పెరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు. 45 ఏళ్ల పురుషుడుగా వెల్లడించారు. బ్యాండేజ్‌లతో బాడీని కట్టేసినట్టు వివరించారు. పునోలోని ఓ పార్క్‌కి ఈ మమ్మీని ఓ బ్యాగ్‌లో పెట్టుకుని తీసుకొచ్చాడు జూలియో. పోలీస్ ప్యాట్రోలింగ్ జరిగిన సమయంలో దీన్ని గుర్తించారు. ఈ మమ్మీని విక్రయించేందుకు చూశారని పోలీసులు చెబుతున్నా…జూలియో మాత్రం కొట్టి పారేశాడు. కేవలం తన ఫ్రెండ్స్‌కి చూపించేందుకు బయటకు తీసుకొచ్చాని చెప్పాడు. మొత్తానికి ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news