బ‌న్నీ కొత్త ఇల్లు.. వెరైటీగా పేరు

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భూమి పూజ చేయించుకున్నారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి భూమి పూజ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న అల్లు అర్జున్ తాము నిర్మించుకోబోయే కొత్త ఇంటికి నామకరణం కూడా చేశాడు. తన ఇంటికి ‘బ్లెస్సింగ్’ అని పేరు పెట్టినట్లు అల్లు అర్జున్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం అర్జున్ జూబ్లీహిల్స్‌లో ఇంట్లో తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆయన ఉంటున్న ఇంటి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు కేవలం తన కుటుంబంతో కలిసి ఉండేందుకు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారట. గతకొద్ది రోజులుగా ‘అల వైకుంఠపురములో’ షూటింగుతో బిజీగా ఉన్న బన్నీ షెడ్యూల్ గ్యాప్ దొరకడంతో మంచి రోజు చూసి. భూమి పూజ చేశారు. మరి ఇప్పుడు తన ఇంటిని ఎలా డిజైన్ చేయించుకోబోతున్నారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news