టూత్ పేస్ట్ పళ్లు తో మొటిమలు లేని ముఖం .. ఎలాగంటే?

5

అయ్య బాబోయ్.. టూత్ పేస్ట్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? టూత్ పేస్ట్ ను వీటి కోసం కూడా ఉపయోగించవచ్చా అని మీరు షాక్ అవుతారు..

పొద్దున లేవగానే మనకు కావాల్సింది ఏంటి. బ్రష్, టూత్ పేస్ట్. పళ్లు తోముకోనిదే మనం ఏదీ చేయం. మన జీవితంలో టూత్ పేస్ట్ భాగం అయిపోయింది. ఎక్కడికెళ్లినా దాన్ని వెంట తీసుకెళ్లాల్సిందే. ఏం చేసినా.. చేయకున్నా… లేవగానే పళ్లు తోముకోకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అయితే.. టూత్ పేస్ట్ ను కేవలం పళ్లు తోముకోవడానికేనా.. ఇంకా దేనికీ ఉపయోగించలేమా? అంటే.. ఉపయోగించవచ్చు. టూత్ పేస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి..
టూత్ పేస్ట్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

amazing tooth paste beauty tips

మొటిమలను తగ్గించడానికి…

మీ ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, కళ్ల కింద మచ్చలు ఉన్నాయా? అయితే మీరు దాని కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీదగ్గర తెల్లటి టూత్ పేస్ట్ ఉంటే చాలు. కలర్లలో ఉంటే టూత్ పేస్ట్ కంటే… తెల్లటి పేస్ట్ అయితే బెటర్. తెల్లటి పేస్ట్ లో ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుంది. అది చర్మానికి హానీ కలిగించదు.

ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో కొంచెం టూత్ పేస్ట్ వేయండి. కొంచెం తేనె వేసి కలపండి. దాన్ని మీ ముఖానికి రాయండి. 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి. అలా కొన్ని రోజుల పాటు చేయండి. మీ ముఖం మీద మొటిమలే ఉండవు.

బ్లాక్ హెడ్స్ ను తొలగించాలన్నా… టూత్ పేస్ట్, ఉప్పు తీసుకొని కాస్త నీరు పోసి కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖానికి కాస్త ఆవిరిపట్టండి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. కొన్ని రోజుల పాటు ఇలాగే చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి.

చర్మంపై ముడతలు ఉన్నా కూడా… ముడతలు ఉన్న ప్రదేశంలో కొంచెం టూత్ పేస్ట్ రాయండి. రాత్రి పూట రాసుకొని.. పొద్దునే చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. చర్మంపై ముడతలు తగ్గుతాయి.

టూత్ పేస్ట్ ను చర్మ సౌందర్యం పెంచుకోవడానికే కాదు.. దాని వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మరో ఆర్టికల్ లో తెలుసుకుందాం.

amazon ad