మరో 18 ప్రమాదకర వైరస్ లు.. చైనా మాంసం మార్కెట్లో గుర్తించిన శాస్రవేత్తలు..!

-

సరిగ్గా ఇదే రోజు చైనాలో కరోనా వైరస్ మొదటికేసు నమోదైంది..జంతువుల ద్వారానే ఈ వైరస్ మనిషికి సోకినట్లు చైనాలతో పాటు ఇత దేశాలుకూడా పరిశోధనలు చేశాయి. అయితే చైనాలో మొత్తం 71 రకలా వైరస్ లు ఉన్నట్లు ఆ పరిశోధనల్లో తేలింది. అందులో 18 వైరస్ లు మనుషులకు ప్రమాదమని సైంటిస్టులు నిర్థారించారు.

చైనాలో, వూహాన్ నగరంలోని మాంసం మార్కెట్ల నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ మంతా విస్తరించి కొన్ని లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇది చాలదన్నట్లుగా, కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్ ల కలకలం మొదలైంది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 71 రకాల వైరస్ లను సైంటిస్టులు గుర్తించారు. ఆ 71లో 18 వైరస్ లు మానవుల పాలిట ప్రమాదకరమైనవిగా పేర్కొన్నారు.

ఇతర జీవరాశుల నుంచే కరోనా వైరస్ మనుషులకు సోకిందనే ఇదివరకటి పరిశోధనల్లో వెల్లడైన నేపథ్యంలో చైనాలోని మాంసం మార్కెట్లే టార్గెట్ గా శాస్త్రవేత్తల బృందాలు కీలక పరిశోధనలు, పరీక్షలు జరిపాయి. చైనాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలకు చెందిన సైంటిస్టులు సంయుక్తంగా ఈ పరిశోధనలు చేశారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వణ్యప్రాణులపై పరీక్షలు జరిపి ఈ నిర్థారణకు వచ్చారు.

చైనా ప్రభుత్వం అమ్మకాలపై నిషేధం విధించిన పలు జంతువులపైన సైంటిస్టులు పరీక్షలు చేశారు. నాలుగు దేశాల సైంటిస్టులు జరిపిన పరిశోధనల రిపోర్టులను పలు సైన్స్ జర్నల్స్ ప్రచురించాయి. సైంటిస్టులు జరిపిన పరీక్షల్లో 71 రకాల వైరస్ లను గుర్తించినట్లు.,వాటిలో 45 వైరస్ లు కొత్తగా కనుగొన్నామని, మళ్లీ అందులో 18 రకాల వైరస్ లు మనుషులకు, జంతువులకు కూడా చాలా ప్రమాదకరమైనవని, వైరస్ ల వ్యాప్తిలో వణ్యప్రాణులదే కీలక పాత్ర అని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సైంటిస్టు షూసు అన్నట్లు జర్నల్ లో పేర్కొన్నారు.

మన ఇళ్లల్లో తిరిగే పిల్లులను పోలి ఉండే సివెట్స్ అనే జంతువుల్లోనే అత్యధికంగా ప్రమాదక వైరస్ లను గుర్తించామని, గబ్బిలాల నుంచి వచ్చే హెచ్కేయూ 8 రకం వైరస్.. సివెట్ జంతువుకు కూడా సోకినట్లు గుర్తించామని, ఈ ప్రమాదకర వైరస్ లు పలు జంతువుల్లో వ్యాప్తిస్తున్నదని సైంటిస్టులు చెప్పినట్లు జర్నల్ లో వెల్లడించారు. ఇప్పటికే కరోనా దెబ్బకు భూగోళం తల్లడిల్లిపోతుంది..ఒకవేళ నిజంగానే చైనా నుంచి ఈ వైరస్ లు కూడా విజృభిస్తే మానవమనుగడ ప్రశ్నార్థకం అవుతుందా?

Read more RELATED
Recommended to you

Latest news