ఫ్యాక్ట్ చెక్: అవునా.. కూల్‌డ్రింక్స్‌లో హెచ్‌టీసీ పాయిజన్ కలుస్తోందా?

-

కూల్ డ్రింక్స్‌లో హెచ్‌టీసీ అనే పాయిజన్ కలుస్తోందని.. దాన్ని తాగడం వల్ల చనిపోతున్నారని.. డాక్టర్లు పరిశోధించి మరీ.. కూల్ డ్రింక్స్‌లో పాయిజన్ ఉందని.. కన్ఫమ్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

కూల్‌డ్రింక్స్.. చల్లచల్లని కూల్ కూల్ అంటూ లొట్టలేసుకుంటూ తాగేస్తాం వాటిని. ఎండాకాలంలో, ఎండ వేడి ఎక్కువగా ఉన్న సమయంలో వెంటనే ఓ చల్లని కూల్ డ్రింక్ తాగాలని అనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇక మద్యం అలవాటు లేనివాళ్లకు ఉన్న ఒకే ఒక మార్గం కూల్ డ్రింక్స్ తాగడం. ఫ్రెండ్స్, బంధువులు మందు కొడుతుంటే.. వీళ్లు మాత్రం కూల్ డ్రింక్స్ తాగుతూ టైమ్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇంటికి ఎవరైనా వచ్చినా.. వాళ్ల గొంతును కూల్ డ్రింక్స్‌తో చల్లబరుస్తుంటారు. పెళ్లిళ్లలో, ఇతర ఫంక్షన్లలో, పార్టీల్లో ఎక్కడ చూసినా ముందుగా కనిపించేది కూల్‌డ్రింకే. చాలు చాలులేవయ్యా.. అసలు విషయం చెప్పవోయ్.. అంటారా? సరే పదండి.. స్ట్రెయిట్‌గా అసలు విషయంలోకి వెళ్దాం.

ఈమధ్య.. కూల్ డ్రింక్స్‌లో హెచ్‌టీసీ అనే పాయిజన్ కలుస్తోందని.. దాన్ని తాగడం వల్ల చనిపోతున్నారని.. డాక్టర్లు పరిశోధించి మరీ.. కూల్ డ్రింక్స్‌లో పాయిజన్ ఉందని.. కన్ఫమ్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే.. ముందు ఆ వీడియో చూడండి.. తర్వాత మాట్లాడుకుందాం.

చూశారు కదా వీడియో. అది సంగతి. అమ్మో.. నిజమా? కూల్ డ్రింక్స్‌లో పాయిజన్ ఉందా? యాక్.. అని అనకండి. ఎందుకంటే.. ఆ వీడియో ఉత్తదే. అంటే ఫేక్. నకిలీ వీడియో. వేర్వేరు ఫోటోలు అంటే అసలు కూల్‌డ్రింక్స్‌కు సంబంధం లేని ఫోటోలు, ఒక ఫోటోకు ఇంకో ఫోటోకు సంబంధం లేని ఫోటోలను కలిపి ఎడిట్ చేసి దానికి హెచ్‌టీసీ అనే ఓ పాయిజన్‌ను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అసలు.. హెచ్‌టీసీ అనే పాయిజనే లేదట. అటువంటి పాయిజన్ పేరే ఇంతవరకు వినలేదు అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక.. ఆ వీడియోలో ఉన్న ఫోటోలు వేర్వేరు ఘటనలకు సంబంధించినవి. ఆ ఫోటోలను గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. కూల్‌డ్రింక్స్‌కు.. ఆ వీడియోలో ఉన్న ఫోటోలకు అస్సలు సంబంధమే లేదు. అది అసలు సంగతి. అందుకే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news