ఏసీ కొంటున్నారా? తక్కువ కరెంట్ బిల్లు రావడానికి ఏం చేయాలో తెలుసుకోండి.

-

వేసవిలో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తుంటాయి. వేడి పెరుగుతుంది కాబట్టి దాన్నుండి తట్టుకోవడానికి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విరివిగా వాడేస్తుంటారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం ఈ నెలలో ఢిల్లీలో సగటున 250-270 యూనిట్ల వాడకం ఉంటుంది. కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చే నెలల్లో మార్చ్ ఏప్రిల్, మే నెలలు ముందు వరుసలో ఉంటాయి. ఐతే ఈ నెలల్లో ఏసీ కొనాలనుకుంటున్నవారు కరెంటు బిల్లలని దృష్టిలో పెట్టుకోవాలి.

కరెంటు బిల్లులు తక్కువగా రావడానికి ఏసీల్లో ఈ ఫీఛర్స్ ఉండాలి.

ప్రతీ ఏడాది 7.75మిలియన్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. అందులో సాధారణ నుండి అసాధారణ రకాలు ఉన్నాయి.

ఇన్వెర్టర్ ఉన్న ఏసీ

ఏసీల్లో ఇన్వెర్టర్ కలిగి ఉన్న ఏసీలని వాడండి. దానివల్ల కంప్రెసర్ పై లోడ్ తగ్గి కరెంటు బిల్లు తగ్గుతుంది. అదీగాక గదిని తొందరగా చల్లబరచడంలో ఇది బాగా పనిచేస్తుంది.

స్టార్ రేటింగ్

ప్రతీ ఏసీకి స్టార్ రేటింగ్ ఉంటుంది. 1-5వరకు వివిధ రకాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవి తీసుకుంటే కరెంటు బిల్లులు తక్కువగా వస్తాయి. ఎంత తక్కువ స్టార్ రేటింగ్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది.

ఉష్ణోగ్రత

కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉండాలంటే ఉష్ణోగ్రతని 24డిగ్రీల వద్ద ఉంచండి. అంతకంటే తక్కువైతే కంప్రెసర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది.

సరైన స్థానం ఎంచుకోండి

మీ గదిలో ఎటు వైపు ఏసీ బిగిస్తున్నారనేది కూడా ముఖ్యమే. సూర్యుడు తగలని 150చదరపు అడుగుల గదిలో 1.50సామర్థ్యం గల ఏసీని బిగించండి.

సర్వీసింగ్

ఏసీ సాధనాల్లో దాదాపు 3000పరికరాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా సర్వీస్ చేయడం చాలా ముఖ్యం. మీ ఏసీ సరిగ్గా పనిచేయాలన్నా, కరెంటు బిల్లు తక్కువ రావాలన్నా రెగ్యులర్ సర్వీస్ తప్పనిసరి.

Read more RELATED
Recommended to you

Latest news