ఫ్రిడ్జ్ లో పెట్టిన నీళ్ళని తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

-

వాతావరణం వేడిగా ఉంటే చాలా మంది ఫ్రిజ్లో పెట్టిన చల్లని నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. బాగా కూలింగ్ గా ఉండే వాటర్ ని తీసుకుంటూ ఉంటారు. అందులో వేసవికాలం ఫ్రిడ్జ్ అంతా కూడా మంచి నీళ్ళతో నిండిపోతుంది కానీ నిజానికి ఫ్రిజ్లో పెట్టిన నీళ్లను తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

జీర్ణ క్రియ దెబ్బతింటుంది:

ఆహారం తిన్న తర్వాత చల్లటి నీళ్లు తాగితే జీర్ణక్రియకి ఇబ్బంది కలుగుతుంది జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

మలబద్ధకం:

వేసవిలో కాకుండా ఎప్పుడూ కూలింగ్ వాటర్ తాగడం వలన మలబద్దకం, గ్యాస్ సమస్యలు కచ్చితంగా వస్తాయి. కడుపునొప్పి కూడా ఈ కారణంగా వస్తుంది.

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది:

చల్లని నీళ్లు తాగడం వలన రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కూలింగ్ వాటర్ తాగకపోవడమే మంచిది.

కొవ్వు సమస్యలు:

బాగా చల్లటి నీళ్లు తాగడం వలన కొవ్వు బయటకి వెళ్లదు కొవ్వు పెరిగిపోతుంది.

చిగుళ్ల నొప్పులు:

చల్లని నీళ్లు తాగితే చిగుళ్ళ నొప్పి కూడా వస్తుంది పంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి.

గుండెపోటు:

చల్లటి నీళ్లను తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కూలింగ్ వాటర్ ని ఎక్కువగా తీసుకోవద్దు.

గొంతు నొప్పి:

గొంతు నొప్పి కూడా చల్లని నీళ్లు తీసుకోవడం వల్ల వస్తుంది. వేసవిలో ఫ్రిజ్లో వాటర్ కంటే కుండలో ఉంచిన నీళ్లు తీసుకోవడం మంచిది. దీని వలన నీళ్లు చల్లగా ఉంటాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news