హెయిర్‌ బాగా పెరుగుతుందని బయోటిన్‌ ఎక్కువగా వాడేస్తున్నారా..?

-

జుట్టు, గోర్లు పెరగడానికి మనకు బయోటిన్‌ అవసరం అవుతుంది. ఇది ఎవరి శరీరంలో అయితే ఉంటుందో వారికి జుట్టు రాలదు, గోర్లు కూడా బాగా పెరుగుతాయి. దీంతో చాలామంది బయోటిన్‌ టాబ్లెట్లు ఎక్కువగా వేసుకుంటారు. అయితే.. బయోటిన్‌ వల్ల కొన్ని దుష్పృభావాలు ఉన్నాయని మీకు తెలుసా..? ముఖ్యంగా మీరు హెల్తీ హెయిర్ , ఒత్తైన జుట్టు కోసం బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బయోటిన్ అంటే ఏంటి..?

బయోటిన్ B విటమిన్ల సమూహానికి చెందినది. దీనిని విటమిన్ హెచ్ లేదా విటమిన్ బి7 అని కూడా అంటారు. ఇది నీటిలో కరిగే విటమిన్. బయోటిన్ మన శరీరంలోని ఎంజైమ్‌లలో ఒక భాగం.. ఇది కొవ్వులు , కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తుంది.. వాటిని శక్తిగా మారుస్తుంది. శరీరంలో నీటిలో కరిగే విటమిన్లు నిల్వ ఉండవు. కాబట్టి వీటిని ఆహారం నుంచి పొందాలి. వీటిని సరైన మోతాదులో తీసుకోవాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బయోటిన్ మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ దాని అధిక వినియోగం మీ శరీరంపై చాలా సమస్యలకు దారితీస్తుంది..

బయోటిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌..

ఎక్కువగా బయోటిన్ తీసుకోవడం వల్ల విటమిన్ సి స్థాయిలు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. జీర్ణ సమస్య ఏర్పడుతుంది.
ప్రేగు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఇది ఇన్సులిన్ విడుదల చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల కాలేయం సరిగా పనిచేయదు.
మూత్ర విసర్జనను పెంచుతుంది. మూత్రపిండాలపై అధిక భారం ఉంది.
ప్రేగు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
ఇది ఇన్సులిన్ విడుదల చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. దీని వల్ల కాలేయం సరిగా పనిచేయదు.
మూత్ర విసర్జనను పెంచుతుంది. మూత్రపిండాలపై అధిక భారం ఉంది.
బయోటిన్ చర్మాన్ని అందంగా ,మెరుగ్గా చేస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు రావచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. డయాబెటిక్ రోగులకు ఇది ప్రమాదకరం.
ఇది గుండెపై కూడా ప్రభావం చూపుతుంది.
బయోటిన్ చర్మాన్ని అందంగా ,మెరుగ్గా చేస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దుర్లు రావచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. డయాబెటిక్ రోగులకు ఇది ప్రమాదకరం.
ఇది గుండెపై కూడా ప్రభావం చూపుతుంది.
చాలా ఎక్కువ బయోటిన్ విటమిన్ B6 స్థాయిలను తగ్గిస్తుంది. ఇది నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

రోజుకు ఎంత అవసరం..

రోజువారీ మోతాదు 30 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులు అయితే.. 35 మైక్రోగ్రాములు తినండి. కోడిగుడ్లు, గింజలు, చేపలు, చిలగడదుంపలు, సోయాబీన్స్, తృణధాన్యాలు వంటి వాటిల్లో బయోటిన్ అధికంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news