అమ్మాయిలకు అందం మీద ఎంతో ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..అందుకోసం మార్కెట్ లో కనిపించిన వస్తువులను వాడేస్తారు.దీనికోసం చాలా ఖర్చు చేస్తారు. ఇదిలా ఉంటే బ్యూటీ ప్రొడాక్ట్స్‌పై కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అందులో ఒకటి లిప్‌స్టిక్. ఇది పెదాలని అందంగా కనిపించేలా చేస్తుంది. అయితే వీటి తయారీలో కెమికల్స్ వాడుతారు. దీనివల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతోంది. లిప్‌స్టిక్ వాడటం వల్ల అందం ఏమోగానీ నష్టాలే ఎక్కువ..కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చనట..ఇక ఆలస్యం ఎందుకు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌లోని ఒక అధ్యయనం ప్రకారం లిప్‌స్టిక్ రంగును తయారు చేయడానికి మాంగనీస్, సీసం, కాడ్మియం ఉపయోగిస్తారని తేలింది. లిప్ స్టిక్ వాడటం వల్ల రకరకాల అలర్జీలు సంభవిస్తాయి.ఒక పరిశోధన ప్రకారం పెదవులకు అప్లై చేసే బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో చాలా కెమికల్స్ వాడుతున్నారు. ఈ రసాయనాల్లో సీసం కూడా ఉంటుంది. పెదవులపై లిప్ స్టిక్ అప్లై చేయడం వల్ల నోటి ద్వారా అది పొట్టలోకి చేరుతుంది. ఇది రకరకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది.. ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
మహిళలు రసాయన లిప్‌స్టిక్‌లు మానేసి సహజసిద్దంగా తయారుచేసినా మూలికా లిప్‌స్టిక్‌లని ఎంచుకోవాలి. లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి ఉపయోగించే సీసం గర్భధారణకు కూడా ప్రమాదకరం.. పిల్లలు పుట్టక పోవచ్చు.. లేదా పిల్లలకు లోపాలు కూడా ఉండోచ్చు.. గర్భిణీకి పిండానికి హాని కలిగిస్తుంది. లిప్ స్టిక్ ద్వారా కడుపులోకి చేరి తద్వారా రక్తంలో సీసం స్థాయి పెరుగుతోంది. ముఖ్యంగా గర్భిణీలు లిప్‌స్టిక్‌కి దూరంగా ఉండాలి.. ఇది తప్పక గుర్తుంచుకోవాలి…