సోషల్ మీడియాలో మీ పూర్తి పేరు పెడుతున్నారా? ఐతే జాగ్రత్త..

-

సోషల్ మీడియా వచ్చాక మనుషుల మధ్య దూరం చాలా తగ్గింది. ఎక్కడో ఏడు సముద్రాల అవతల ఉన్నవాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం. పక్కనే ఉన్నట్టు ఫీల్ అవగలుగుతున్నాం. సోషల్ మీడియా వల్ల దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరవుతున్నారు. దగ్గరగా ఉన్నవారు దూరం అవుతున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. దాని గురించి వదిలేస్తే, సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా డేటా థెఫ్ట్ గురించిన వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం పెట్టే సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలైతే మరీనూ. మీ పేరుని ఇంటి పేరుతో సహా పెట్టవద్దు. సోషల్ మీడియా అనే కాదు, ఆన్ లైన్లో ఎక్కడ పెట్టినా మీ పేరు మాత్రమే యాడ్ చేయండి. వివిధ వెబ్ సైట్లలో మీ పేరుని ఒకే రకంగా పెట్టుకున్నా ఇంటి పేరుని మాత్రం పెట్టవద్దు. ఇంకా ఒకటికి మించి ఈమెయిల్స్ వాడడం ఉత్తమం. సోషల్ మీడియా అకౌంట్లకి సెపరేట్ గా మరో ఈ మెయిల్ పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.

వ్యక్తిగత సమాచారం కోసం ప్రత్యేకమైన ఈ మెయిల్ ఐడీ వాడండి. పాస్ వర్డులు మర్చిపోతామేమోనన్న ఆలోచన చేయవద్దు. కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. మరో ముఖ్య విషయం, గూగుల్ ఇమేజెస్ లో మీ పేరుతో సెర్చ్ చేస్తే మీ ఫోటోలు వస్తున్నాయేమో చూసుకోండి. అలా వస్తే గనక ఏ సైట్ నుండి అవి గూగుల్ లోకి వచ్చాయో చూసుకుని, ఆ సైట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు గూగుల్ నుండి తీసేస్తారు. మీ సమాచారం మీ వ్యక్తిగతం. మీ అనుమతి లేకుండా దాన్ని తీసుకునే హక్కు ఎవరికీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news