ఔరా! అనిపించేలా దుబాయ్ టెక్నాలజీ… మేఘాలకు కరెంట్ షాక్ పెట్టి

-

చాలా మంది డబ్బులు ఎక్కువగా సంపాధించేందుకు ఎక్కువగా దుబాయ్ లాంటి ఎడారి దేశాలకు వెళ్తారు. ఇక్కడ ఆకాశాన్నంటే బిల్డింగులతో పాటు అనేకంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దుబాయ్ షేకులు హైదరాబాద్ అమ్మాయిలను ఎత్తుకెళ్తారనే అపవాదు కూడా ఉంది. ఈ అపవాదు సంగతి ఎలా ఉన్నా… దుబాయ్ మాత్రం భూలోకంలో ఉన్న స్వర్గం లాంటి ప్రదేశం అని అందరూ కొనియాడుతారు. అక్కడ ప్రధానంగా పెట్రోలు బావులనే అందరూ నమ్ముకున్నారు. ఇక్కడ ఉండే టెక్నాలజీ కూడా చాలా మందిని అబ్బురపరుస్తూ ఉంటుంది. అందరూ ఔరా! అనేలా దుబాయ్ శాస్త్రవేత్తలు టెక్నాలజీని అనేక కొత్త పుంతలు తొక్కించారు.

clouds

దుబాయ్ లో ఎటు చూసిన ఎడారులే కనిపిస్తాయి. అసలు అక్కడ వర్షాలనేవే పడవు. ఇలాంటి దుబాయ్ లో శాస్త్రవేత్తలు టెక్నాలజీని ఉపయోగించి వర్షం కురిపించారు. అక్కడ ఉన్న అధిక తాపం నుంచి రక్షణ ఉంటుందని ప్రజలకు చెప్పకనే చెప్పారు. ఇలా మేఘాలకు ఎలా కరెంట్ షాక్ ఇవ్వడం సాధ్యపడుతుందని చాలా మందికి అనుమానం రావచ్చు. డ్రోన్ల సాయంతో శాస్త్రవేత్తలు మేఘాల‌కు షాకిచ్చి కృత్రిమంగా వ‌ర్షాన్ని కురిపించారు. ఇలా మేఘాలకు షాకిచ్చి వర్షం కురిపించిన సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

ఇలా మేఘాలకు షాకిచ్చేలా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుకు నిధులను యూఏఈ ప్రభుత్వం సమకూర్చగా శాస్త్రవేత్తలు తమపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మరో విషయమేంటంటే ఇందులో యూకే సైంటిస్టుల పాత్ర కూడా ఉంది. ఇలా మేఘాల్లోకి విద్యుత్ ను పంపించే టెక్నాలజీని వారే డెవలప్ చేశారు. యూకేలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ రీడింగ్ సైంటిస్టులు ఇలా మేఘాలను కూడా విద్యుత్ షాక్ కు గురిచేసే టెక్నాలజీని కనుగొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news