స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఆ ఊరిలో బ్యాంకింగ్ సేవలు..

-

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నాం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. కాగా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన క్రమంలో దేశంలో పలు మార్పులు సంభవించాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించేందుకుగాను ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో దేశం కొంత మందుంజ వేసింది. అయితే, అక్షరాస్యత విషయమై దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందింది. దళారుల వ్యవస్థ లేకుండా ప్రభుత్వం అందించే సబ్సిడీ, సంక్షేమ ఫలాలు అనగా రాయితీలు, డబ్బులు నేరుగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రస్తుతం బ్యాంక్ మస్ట్. కాగా, దేశంలో ప్రస్తుతం ప్రతీ ఒక్కరు దాదాపుగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారు. ఒక వేళ బ్యాంక్ అకౌంట్ లేని వారుంటే వారికి బ్యాంకులు జీరో అకౌంట్స్ ఇస్తున్నాయి. కాగా, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్తైనా ఆ ఊరి ప్రజలకు ఇంకా బ్యాంకింగ్ సేవలు అందడం లేదు.

ఒడిశాలోని సంబాల్‌పూర్‌ జిల్లాలోని కుద్‌ గుండేర్‌పూర్‌ అనే గ్రామం అది. ఇక్కడ మహానది పాయలుగా విడిపోయిన ఒక దీవిలో ఉన్నది. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న ఐదు వేల మంది జనాభాకు ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదు. విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యాలను పొందడంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నంది. ఇక గర్భిణులు అయితే తమ ప్రాణాలను పణంగా పెట్టి పీహెచ్‌సీలను చేరుకోవాల్సిన దుస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ విలేజ్ సమస్యలు పరిష్కరించేందుకు 2015లో సంబల్‌పూర్ జిల్లా కలెక్టర్ బల్వంత్ సింగ్ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నాడు. అధికారులను బ్రిడ్జి త్వరగా నిర్మించాలని ఆదేశించాడు. గతేడాది ఫిబ్రవరిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. దాంతో గ్రామస్తులకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఇక ఆ గ్రామంలో బ్యాంకింగ్ సేవలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే ‘ఉత్కల్‌ గ్రామీణ బ్యాంకు’ అక్కడ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయగా, ఆఫీసర్స్ పూజ కార్యక్రమం నిర్వహించి సర్వీస్ పాయింట్ ప్రారంభించారు. దాంతో ఈ గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామస్తులు ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news