ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ, బోనాలకు చోటు దక్కింది. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబాలైన బతుకమ్మ పండుగ, బోనాల పండుగ పదాలు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటు చేసుకోవడంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. వాటిని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చడానికి తాము సుముఖంగా ఉన్నట్టు ఆక్స్‌ఫర్డ్ ఎడిటర్ తెలిపారు.
ఎంపీ కవిత ఈ పదాలను ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చాలని ఆక్స్‌ఫర్డ్ సంస్థను అభ్యర్థించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న సంస్థ.. డిక్షనరీలో చేర్చడానికి డ్రాఫ్టింగ్ చేస్తున్నట్టు కవితకు పంపించిన లేఖలో పేర్కొన్నారు. ఈసందర్భంగా కవితకు పంపించిన లేఖను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో త్వరలో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ, బోనాలు పదాలను మనం చూసుకోవచ్చన్నమాట.
So happy to receive this letter from the Oxford English Dictionary @oed acknowledging our request to include the words “Bathukamma” and “Bonalu” in the English dictionary!
Two new nouns in the English language from the Telangana culture ! – sounds good ? pic.twitter.com/gEapB0pgba— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 26, 2018