బతుకమ్మ విశిష్టతను ఈ యువతి ఎంత బాగా చెప్పిందో చూడండి…!

-

బతుకమ్మ.. తెలంగాణ పండుగ. ప్రపంచంలో ఎక్కడా పూలను పూజించరు. కానీ.. తెలంగాణలో బతుకమ్మ పండుగ సమయంలో పూలను పూజిస్తారు. దేవుళ్లను పూజించే ఆ పూలను పూజించడం అనేది గొప్ప ఆచారం. అది ఒక తెలంగాణలోనే ఆచరించబడుతున్నది. అందుకే తెలంగాణలోనే కాదు.. ప్రపంచంలో నలమూలల ఉన్నా… తెలంగాణ ప్రజలు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు.

అయితే.. చాలా మందికి బతుకమ్మ పండుగ విశిష్టత, ప్రాశస్త్యం తెలియదు. అసలు బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారు.. దాన్ని 9 రోజులు ఎందుకు జరుపుకోవాలి.. ఒక్కోరోజు ఒక్కో పేరుతో ఎందుకు బతుకమ్మను పిలుస్తారు.. అంటే మాత్రం కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే.. అటువంటి సందేహాలకు ఒకే ఒక్క సమాధానం ఈ వీడియో. ఈ యువతి తెలంగాణ యాసలో బతుకమ్మ పండుగను ఎంత బాగా చెప్పిందో చూడండి. తీరొక్క పూలను బతుకమ్మలా పేర్చినంత సింపుల్ గా బతుకమ్మ విశిష్టతను ఆ యువతి చెప్పేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియో చూసేసి బతుకమ్మ పండుగ విశిష్టతను పది మందికి తెలియజేయండి.

Read more RELATED
Recommended to you

Latest news