ఆలస్యంగా పెళ్ళి చేసుకున్నవారే సంతోషంగా ఉంటారా? నిపుణులు ఏం చెబుతున్నారు.

కాస్త వయసు వచ్చిందంటే చాలు పెళ్ళి చేసుకోమని సమాజం ఒత్తిడి పెడుతూ ఉంటుంది. ఆలస్యం అవుతుంటే ఇబ్బంది కలుగుతుందని, పిల్లలు పుట్టడంపై ప్రభావం ఉంటుందని రకరకాల భయాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది తొందరగా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆలస్యంగా పెళ్ళి చేసుకుంటే చాలా లాభాలున్నాయి. సమాజం గురించి వదిలేస్తే కొంచెం వయసు మీద పడ్డాక పెళ్ళి చేసుకోవడం వల్ల వచ్చే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకుందాం.

విడిపోయే అవకాశాలు తక్కువ

ఎక్కువ వయసులో పెళ్ళి చేసుకుంటే మీకు నచ్చిన వారు, మీకు తగిన వారు దొరికే అవకాశం ఎక్కువ. మీకు వయసు వచ్చింది కదా అని చెప్పి పెళ్ళి చేసుకుంటే రేపు పొద్దున్న వచ్చే ఇబ్బందులను తట్టుకోలేక విడిపోవాల్సి రావచ్చు. వయసు పెరుగుతుంటే అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది.

వ్యక్తిగత స్వేఛ్ఛ

ఎక్కువ వయసులో వ్యక్తిగత స్వేఛ్ఛ సులభంగా అర్థం అవుతుంది. ఇతరుల కోసం పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఉండదు. నీకోసం నీకు తోడు కావాలని అనిపించినపుడే పెళ్ళి మీద ఆలోచన కలుగుతుంది.

ఆలోచనలు మెరుగుపడతాయి

20ల్లో పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమ గురించి అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉండదు. అప్పటికే భాగస్వామి ఉంటుంది కాబట్టి పెద్దగా ఆలోచనలు మెరుగు పడే అవకాశం ఉండదు. అదే ఎక్కువ వయసులో చేసుకుంటే అప్పటికే వాస్తవ జీవితంలోని సాధకబాధకాలు అర్థం అవుతాయి. నిజమైన ప్రేమ అప్పుడే కనిపిస్తుంది.

కమిట్మెంట్

తొందరగా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని, ఆ తర్వాత ఏదో మిస్సవుతున్నామన్న ఫీలింగ్ లో చాలామంది ఉంటారు. యవ్వనంలోనే బాధ్యతలు వచ్చేసాయన్న బాధ బాగా కనిపిస్తుంటుంది. అదే ఒక వయసు వచ్చాక బాధ్యతలకి రెడీగా ఉంటారు కాబట్టి పెద్దగా వాటి గురించి పట్టించుకోరు.