రొమాన్స్ వల్ల లాభాలు.. శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి..

వివాహంలో జంటలు ప్రేమను కలిగి ఉండడం సాధారణమే. వివాహం జరిగిన కొత్తలో జంటల మధ్య ప్రేమ పీక్స్ లో ఉంటుంది. అందుకే తమ భాగస్వామి కొద్ది సేపు కనబడకపోయినా అదోలా ఫీల్ అవుతారు. ఆ సమయంలో విరహాన్ని వాళ్ళు తట్టుకోలేరు. ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ రొమాన్స్ వల్ల తారాస్థాయికి చేరుకుంటుంది. వివాహ బంధం ద్వారా ఒక్కటైన జంటల మధ్య బంధం మరింత గట్టిపడడానికి రొమాన్స్ చాలా అవసరం. వివాహం తర్వాత కొందరు రోజూ రొమాన్స్ చేస్తారు. మరికొందరు వారానికి మూడు సార్లు శారీరకంగా కలుస్తారు.

 

రొమాన్స్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. శృంగారం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రస్తుతం శృంగారం వల్ల కలిగే ప్రయోజనాలని తెలుసుకుందాం.

ఒక పరిశోధన ప్రకారం శృంగారం శరీరానికి మంచి వ్యాయామం వంటిది. శృంగార సమయంలో 7500కేలరీలు ఖర్చు అవుతాయి. దానివల్ల బరువు తగ్గుతారు. శారీరకంగా కలవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదలై ఒత్తిళ్ళ నుండి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. రక్తప్రసరణ పనితీరు మెరుగవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.

శారీరకంగా కలవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడైంది. వ్యాధులతో పోరాడే శక్తి పెరగడంలో శృంగారం పాత్ర కీలకం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీళ్ళ నొప్పులు, మైగ్రేన్ వంటి వాటితో ఇబ్బంది పడేవారికి శృంగారం మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శృంగారం వల్ల రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా కలిగే బాధల నుండి విముక్తి లభిస్తుంది. అందుకే రొమాన్స్ చేయడానికి బద్దకించేవారిని ప్రపంచంలోనే అతిచెడ్డ బద్దకస్తుడు అంటారు.