అక్కడ ఆ చెట్టు కిందే ఎన్నికలు..!

-

ఎన్నికలంటేనే మైకుల హోరు.. ప్రచారాల జోరు.. పోటాపోటీగా మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం గొడవాలు పరస్పర దాడులు చూస్తునే ఉంటాం. కానీ ఆ గ్రామంలో ఎన్నికలంటే అలాంటేవేమీ ఉండవు. ఎవరూ పోటీ చేసినా ఏకగ్రీమే. వారి తాత ముత్తాతలు పెట్టుకున్న ఆచారాన్ని ఇప్పటి వరకూ కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకార గ్రామమైన పెదపట్టపుపాలెం పంచాయతీగా మారినప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి ఎన్నికలు నిర్వహిచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకున్న గ్రామ సర్పచులు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికోబడ్డారు. ఆ గ్రామ పెద్దమనుషులు తీసుకునే నిర్ణయానికి వారందరూ శిరసావహిస్తారు. ఆ పార్టీ ఈ పార్టీలంటూ అలాంటేవేవీ ఉండవు. ఇలా ఎన్నికలు నిర్వహించుకోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఎన్నికల ఖర్చులు లేకుండా చేçస్తున్నారు.

ఐదుసార్లు..

మొట్టమొదట 1998లో చాకిచర్ల నుంచి పెదపట్టపుపాలెం ప్రత్యేక పంచాయతీగా రూపుదిద్దుకుంది. తదనంతరం నాలుగు సార్లు పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన ఎన్నికల్లో ప్రళయ కావేరి సుబ్రమణ్యం, 2003లో ఆవుల జయరాం, 2008 లో వాయల పోలమ్మ, 2013 లో తుమ్మల తిరుపతమ్మ వీరంతా ఏకగ్రీవంగానే సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్‌లో కూడా ఏకగ్రీవంగా అభ్యర్థి ఎంపికకు చర్చలు జరుగుతున్నాయి. ఆ గ్రామానికి నడిబొడ్డున ఉన్న రెండు శతాబ్దాల నాటి చెట్టు కింద కూర్చుని కాపుల నేతృత్వంలో గ్రామస్థులందరూ సమక్షంలో తీసుకేనే నిర్ణయానికి వారందరూ కట్టుబడి ఉంటారు.

ఎంపీటీసీలు సైతం..

పెదపట్టపుపాలెం గ్రామం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి దాకా ఎంపీటీసీనూ ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఇటీవల సగంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియతో సహా ఇప్పటి వరకు జరిగిన ఐదు ఎంపీటీసీ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 4239 ఉండగా, పురుషులు 2147, మహిళలు 2098 ఉన్నారు. 3070 మంది ఓటర్లలో 1574 మంది పురుషులు, 1496 మంది మహిళలు ఉన్నారు.

ఇంత మంది ఓటర్లు ఉన్నా ఏ ఒక్కరు కూడా తాము ఈ సారి ఎన్నికల్లో నిలబడాలి.. అధికారం చెలాయించాలని అనుకోరు. అందరూ కలసికట్టుగా ఒకే నిర్ణయం తీసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. గతేడాది ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలు గ్రామ అభివృద్ధికికే ఖర్చు చేశారు. ఈ సారీ ఏకగ్రీవమే అయితే ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు అందనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news