పంజరంలో పందెం కోడి…నిజామాబాద్‌ వాసి వ్యాపారం అదరహో..!!

-

పంజరంలో చిలుకలను పెంచడం మనకు తెలుసు.. కానీ కోళ్లను పెంచడం మీరు ఎప్పుడైనా విన్నారా..? పంజరంలో నాటు కోళ్లను పెంచుతూ కత్తిలాంటి బిజినెస్‌ చేస్తున్నాడు మన తెలంగాణ వాసి.. సొంతంగా వ్యాపారం చేయడంలో ఉండే సంతోషమే వేరు. అది చిన్నదైనా పెద్దదైనా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన దశరథ్ ఉపాధి కోసం భిన్నమైన పంథా ఎంచుకున్నారు. రెండేళ్లుగా పంజరంలో నాటు కోళ్లు, గిన్నె కోళ్లు, పందెం కోళ్లు పెంచుతూ భారీగా ఆదాయం పొందుతున్నాడు.
10 reasons cages suck for hens | Animals Australia
ఏడ‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన ధ‌శ‌ర‌థ్ కారు డ్రైవ‌ర్‌గా ప‌ని చేసి కుటుంబాన్ని పోషించుకునే వాడు. అయితే 2020లో రోడ్డు ప్రమాదంలో దశరథ్ కాలు విరిగింది. డ్రైవింగ్ చేయ‌డం కష్టం అయింది. స్నేహితులు కోళ్ల ఫారమ్ పెట్టుకొమ్మని స‌ల‌హ ఇచ్చారు. ఆ తర్వాత నాటు కోళ్ల పెంపకంపై అధ్యయనం చేసి.. విజయవాడ నుంచి సీడ్ తెచ్చి కోళ్ల పెంపకం ప్రారంభించాడు.. పంజ‌రంలో నాటు కోళ్లు, గిన్నే కోళ్లు, పందెం కోళ్లను పెంచుతున్నాడు.
అంక‌పూర్‌లో నాటు కోళ్లుకు గిరాకి బాగా ఉంది. అక్కడ ప్ర‌తిరోజు 600కు పైగా నాటు కోళ్లు అమ్ముడవుతుంటాయి. వాటికి అంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దశరథ్ స్థానికంగా వాటిని విక్రయించి.. మిగిలిన వాటిని విజయవాడకు ఎగుమతి చేస్తారు. జాగ్రత్తలు పాటించి వ్యాధుల భారిన పడకుండా చూసుకుంటే స్థిరమైన ఆదాయం పొందొచ్చని దశరథ్‌ అంటున్నారు. విజయవాడ దగ్గర కంకిపాడు గ్రామం నుంచి కొన్ని పెట్ట‌లు తీసుకొచ్చారట…కొక్కేరా, కోడి కాకి, కాకి డేగ, నెమలి ఇలాంటి ర‌కాల బ్రీడ‌ర్స్ తీసుకొచ్చినట్లు దశరథ్‌ తెలిపాడు. పందెం కోళ్లు ఇప్పటికే 15 వ‌ర‌కు రెడీగా ఉన్నాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ.25 నుంచి రూ.30వేలకు ఉంటుంది.

ఖర్చులు ఎట్లా..?

దశరథ్ నాటు కోడి సీడ్ కోసం రూ.80 వేలు ఖర్చు చేశారు. 20 పంజరాల తయారీకి రూ.28 వేలు అయిందట..దాణాకు ప్రతినెల రూ. 5 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ కోళ్లు పెట్టే గుడ్లతో సొంతంగా సీడ్‌ను తయారు చేసుకోవడం వల్ల మరింత లాభం ఉంటుందంటున్నాడు. ఆదాయం ఆరునెల‌ల‌కు ఖ‌ర్చులు పోను ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు వ‌స్తుంద‌ట..పందెం కోళ్లు అమ్మితే.. భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news