బట్ట తలకు ఎయిర్ పోర్ట్ కి లింక్ ఉందా…?

-

ప్రశ్నే వింతగా ఉంది కదూ…? అవును మరి మాకు వింతగానే ఉందిలే. బట్ట తల వచ్చిన వాళ్ళు ముందు ఎం చేస్తారు…? ముందు మందులు, నూనేలు వాడటం సంగతి పక్కన పెట్టి బాధపడతారు. అవునా కాదా…? చెప్పరెంటి మరి…? ఎవరికి అయినా బాదే కదా పాపం. జుట్టు ఉండాలని మొక్కు కూడా చెల్లించుకునే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఆ షాంపూ, ఈ షాంపూ అంటూ జుట్టుని కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టాలు పడుతున్నారు.

దరిద్రం ఏంటీ అంటే చిన్న వయసులోనే బట్ట తల సమస్య అనేది చాలా మందిని వేధించే అంశం కూడా. అయితే ఇప్పుడు మీకో విషయం చెప్పాలి. బట్ట తల గురించి సంతృప్తి ఏ విధంగా ఉంటుంది…? సీరియస్ అవకండి, ఏదో కాసేపు నవ్వుకుంటారు అని అంతే. బట్టతల రకాలు రెండు అన్నమాట. Helipad-Airport అని ఉంటాయి. మళ్ళీ Helipad లో రెండు రకాలు ఉంటాయి.

1. గ్రౌండ్ మధ్యలో ఏర్పాటు అయ్యేవి. 2. గ్రౌండ్ కు వెనకాల ఏర్పాటు అయ్యేవి. Airport లో మూడు రకాలు ఉంటాయి. 1.Regional:- చిన్న చిన్న సిటీల్లో ఉండేవి.! అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్’కు ఉపయోగిస్తూ, మిగతా సమయాల్లో ఇతర పనులకు ఉపయోగించేది. దీనిని జుట్టుతో కవర్ చేయొచ్చు. 2.Domestic:- ఇంటర్ సిటీ, స్టేట్, కార్గోలకు అనుకూలంగా ఉంటుంది.

అక్కడక్కడా గడ్డి మొలిచినా, రన్ వే మాత్రం నీట్ గా ఉంటుంది. 3. International:- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ లాగా విశాలంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్, రన్ వేస్, నీట్ గా ఉంటాయి. గార్డెనింగ్ కూడా తక్కువగా ఉన్నా, మైంటైనెన్స్ నీట్’గా ఉంటుంది. కాబట్టి మీది ఏ రకమో తేల్చుకోండి. అంతే బట్ట తలను ఇలా పోల్చుకుని ప్రౌడ్ గా ఫీల్ అవండి.

Read more RELATED
Recommended to you

Latest news