Chandrayaan-3 : చంద్రయాన్‌ మిషన్‌లో విక్రమ్‌ ల్యాండ్‌ అయ్యేది కరెక్టుగా ఇక్కడే..!!

-

చంద్రయాన్‌ 3 మిషన్‌లోని విక్రమ్ ఈరోజే ల్యాండ్‌ అవబోతుంది. సేఫ్‌ ల్యాండింగ్‌పై ఇస్రో ధీమా వ్యక్తం చేస్తుంది. ల్యాండ్‌ అయ్యే చోట రాళ్లు, గుంతలు ఉన్నా.. ల్యాండర్‌ అడ్జెస్ట్ చేసుకుని సేఫ్‌ ప్లేస్‌లో ల్యాండ్‌ అవుతుందట.. ఆ సేఫ్‌ ప్లేస్‌ ఎక్కడ..? ఎక్కడ దిగుతుంది.? ఈ విషయాలు తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు కదా.! ఆ ప్లేస్‌ ఏంటో మనం ఇప్పుడు క్లియర్‌గా చూద్దామా.!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో (ISRO) ప్రకారం.. ఈరోజు సాయంత్రం 6.04కి చందమామ దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగబోతోంది. ల్యాండర్ దిగిన తర్వాత దాని డోర్ ఓపెన్ అవుతుంది. అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ చక్రాలతో కదులుతూ బయటకు దిగుతుంది. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగాన్ని లైవ్‌లో చూసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇస్రో యూట్యూబ్‌, ఫేస్‌బుక్ డీడీ నేషనల్ టీవీలో సాయంత్రం 5.27 నుంచి లైవ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

ల్యాండింగ్ మాడ్యూల్.. చందమామకు 25 నుంచి 134 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉంది. ఇది గుండ్రంగా కాకుండా గుడ్డు ఆకారంలో తిరుగుతోంది. అందువల్ల ఇది చందమామకు దగ్గరగా వచ్చినప్పుడు 25 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దూరంగా ఉన్నప్పుడు 134 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందట.

ఇస్రో చెప్పే ప్రకారం చందమామ దక్షిణ ధృవంలో 69.367621 S, 32.348126 E ఈ కోఆర్డినేషన్ దగ్గర విక్రమ్ ల్యాండ్ కాబోతోంది. అంటే ఫోటోలో ఆ బాణం గుర్తు ఉన్న చోట దిగబోతోంది. అత్యంత చదునుగా.. ఎత్తుపల్లాలు పెద్దగా లేని ప్రదేశంలో ల్యాండర్ దిగబోతంది. ఆ సర్కిల్ మధ్యలోని చుక్క దగ్గర ల్యాండర్ దిగబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news