ఫ్లైట్ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది మనం మన గమ్యస్థానాన్ని కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. ఎక్కువ సేపు ప్రయాణం చేయక్కర్లేదు. దూరదూర ప్రాంతాలని కూడా వేగంగా చేరుకోవచ్చు. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు వేగం గా వెళ్లడానికి ఫ్లైట్ కంఫర్ట్ గా ఉంటుంది. ఫ్లైట్ ఎక్కే ముందు మాత్రం కొన్ని ఆహార పదార్థాలను తినడం మంచిది కాదు. విదేశాలకు వెళ్తున్నప్పుడు కానీ ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు కానీ అసలు మీరు ఫ్లైట్ ఎక్కే ముందు వీటిని తినకండి వీటిని తింటే అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఫ్లైట్ ఎక్కే ముందు ఆపిల్ తినకండి. ఇది ప్రమాదం విరోచనాలు అయిపోతాయి జీర్ణం కూడా సరిగ్గా అవదు. బొప్పాయి వంటి ఫ్రూట్స్ని మాత్రం తీసుకోవచ్చు. ఫ్లైట్ ఎక్కే ముందు బ్రోకలీ తీసుకోకూడదు క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రోకలీ వంటివి తినడం వలన గ్యాస్ వస్తుంది. కాబట్టి వీటికి కూడా ఫ్లైట్ ఎక్కే ముందు దూరంగా ఉండాలి. ఫ్లైట్ ఎక్కే ముందు మీరు ఫాస్ట్ ఫుడ్ ని కూడా తీసుకోవద్దు. సోడియం చక్కర శాతం ఎక్కువ వీటిలో ఉంటుంది కాబట్టి ప్రమాదం కలుగుతుంది.
కెఫీన్ వుండే డ్రింక్స్ ని కూడా ఫ్లైట్ ఎక్కే ముందు తీసుకోవద్దు బాడీ డిహైడ్రేషన్ కి గురై ఇబ్బంది పడాలి. సలాడ్స్ వంటి వాటిని కూడా ఫ్లైట్ ఎక్కే ముందు తినకండి ఇందులోనే పచ్చికూరలు, పచ్చి పండ్లు పొట్టలో గ్యాస్ ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి తినొద్దు. బీన్స్ ని కూడా మీరు అసలు ఫ్లైట్ ఎక్కే ముందు తినకండి జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది సమస్య కలగవచ్చు బాడీ ని డిహైడ్రేట్ గా ఉంచడం ముఖ్యం. స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి మంచినీళ్లను తీసుకోండి. ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు ఇలా ఫ్లైట్ ఎక్కే ముందు వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది లేదంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇబ్బంది పడాలి.