చీజ్ తో చాయ్..టేస్ట్ వేరేలెవల్..

-

సోషల్ మీడియాలో రోజుకొక వీడియో వైరల్ అవుతూ వస్తున్నాయి..అందులోనూ ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి..ఇప్పటికే ఎన్నో వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అయితే ఇప్పుడు మరో వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.. కొన్ని వెరైటీ ఫుడ్ కాంబో వీడియోలు నెటిజ‌న్ల నోరూరిస్తుండ‌గా మ‌రికొన్నింటిని చూసి వారు పెద‌వివిరుస్తున్నారు. తాజాగా చీజ్ చాయ్ వీడియోతో చిర్రెత్తుకొచ్చిన నెటిజ‌న్లు ఇదేం కాంబినేష‌న్ అంటూ విరుచుకుప‌డ్డారు.

అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ పెప్పర్ టీ.. ఇప్పటివరకూ చాలా రకాల తేనీటి విందును ఆస్వాదించి ఉంటాం. కానీ ఈ చీజ్ టీ ఏంటీ.. అనుకుంటున్నారా.. అదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

చీజ్ చాయ్ వాలీ అనే పేరుతో షేర్ చేసిన ఈ వీడియోలో నోరూరించే టీ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. అయితే తనతో పాటు.. టీ ప్రియలందరికీ అని మెన్షన్ చేస్తూ.. ఇండియాలో ఒక చోట ఈ చీజ్ టీని అమ్ముతున్నారని ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోను చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీన్ని చూస్తే వాంతులు వచ్చేలా ఉందని ఒకరంటే.. ఈ గ్రహం నుంచి వెళ్లిపోయే టైం వచ్చిందని మరొకరు స్పందించారు. ఇంకొకరేమో అసలిది చీజ్ టీనే కాదని, ఇది చీజ్ ఆనియన్ సూప్ అని రకరకాల కామెంట్లు చేస్తూ వారి ఫీలింగ్ ను షేర్ చేశారు..ఏది ఏమైనా కూడా ఈ టీ ఇప్పుడు అందరి మనసును దొచుకుంది.. మీరు కూడా ఓసారి ఆ టీ పై లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news