చాక్లెట్ డే ప్రాముఖ్యత… విశేషాలు.. కొటేషన్లు..

Join Our Community
follow manalokam on social media

ఫిబ్రవరి నెల అంటేనే రొమాంటిక్ మంత్ అని అర్థం. సరిగ్గా సగం నెలకి ప్రేమికుల రోజు వస్తుంది కాబట్టి ఆ నెలంతా అదే ఫ్లేవర్ ఉంటూనే ఉంటుంది. అందుకే ఈ నెలని రొమాంటిక్ నెలగా పిలుస్తారు. ఐతే ప్రేమికుల రోజుకి వారం రోజుల ముందు నుండి ఏదో ఒక స్పెషల్ డే ఉంటూనే ఉంటుంది. ఆ రోజులన్నీ కలిసి ప్రేమికుల రోజుని మరింత అందంగా మార్చేందుకు పనిచేస్తాయి. అందులో భాగంగానే ఈ రోజు చాక్లెట్ డే గా జరుపుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, ఆ తర్వాత చాక్లెట్ డే.

ఇలా ఒక్కో రోజుని ఒక్కో విధంగా సెలెబ్రేట్ చేసుకుని మీరు ప్రేమించిన వారికి ప్రేమికుల రోజుని గుర్తుండిపోయేలా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. చాక్లెట్ డే రోజున మీరు ప్రేమించిన వారి నోరు తీపి చేస్తూ, భవిష్యత్తు అంతా ఇదే మాదిరిగా ఉంటానని భరోసా ఇవ్వడమే చాక్లెట్ డే రోజు గొప్పతనం. ఈ చాక్లెట్ డే రోజున మీరు ప్రేమిస్తున్న వారికి చాక్లెట్ ఇచ్చి మరీ మీ ప్రేమని తెలియజేయండి. చాలా మంది ప్రేమికులు తమ ప్రేమని ఫిబ్రవరి నెలలోనే తెలియజేస్తారు. దానిక్కారణం ఫిబ్రవరి నెలలో చెప్తే నో చెప్పరన్న ఫీలింగ్.

చాక్లెట్ డే రోజున మీరు ప్రేమించిన వారికి విషెస్ తెలియజేయడానికి కావాల్సిన కొటేషన్లు..

మన ప్రేమ బంధం చాక్లెట్ వంటిది. తీపితో పాటు ఆనందం కలుపుకుని ఆస్వాదిద్దాం. హ్యాపీ చాక్లెట్ డే.

నీ తియ్యదనానికి ఈ ప్రపంచంలో సాటైనది ఏదీ లేదు. చాక్లెట్ అయినా సరిపోతుందేమోనని పట్టుకొచ్చా.. హ్యాపీ చాక్లెట్ డే డియర్.

కళ్ళని పట్టుకోవడం అందరికీ సులభమే. కానీ మనసుని పట్టుకోవడమే చాలా కష్టం. అది నువ్వు పట్టుకున్నందుకు హ్యాపీ చాక్లెట్ డే.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...