65 ఏళ్ళ దొంగ, బ్యాంకులో డబ్బు దొంగలించి ఏం చేసాడంటే, ఇలాంటి సంఘటన గురించి విని ఉండరు…!

-

సాధారణంగా బ్యాంకు దొంగతనాలు చేసిన వారు ఎం చేస్తారు…? భారీగా డబ్బు దొంగలించి వాటిని తీసుకుని పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పోలీసులకు దొరకకుండా పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాని ఒక దొంగ కష్టపడి బ్యాంకు దొంగతనం చేసి ఆ డబ్బుని గాల్లోకి విసిరేశాడు. అర్ధం కాలేదు కదూ…? అయితే ఈ స్టొరీ చదవాల్సిందే. సోమవారం మధ్యాహ్నం కొలరాడోలోని స్ప్రింగ్స్, కోలోలో, జరిగిన ఈ సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది.

డౌన్‌టౌన్ బ్యాంకు నుండి 65 ఏళ్ల డేవిడ్ ఆలివర్ వేలాది డాలర్లను దొంగలించాడు. దొంగలించిన తర్వాత సాధారణంగా డబ్బుతో అతను పారిపోవాలి. కాని అనూహ్యంగా ఆ డబ్బుని బయటకు తీసుకొచ్చి మేరీ క్రిస్మస్ అని అరవడం మొదలుపెట్టి డబ్బు కట్టలను గాల్లోకి విసిరేశాడు. వెంటనే సెలవు శుభాకాంక్షలు కూడా అక్కడి వారికి చెప్పాడు. ఆ తర్వాత అనూహ్యంగా అక్కడి నుంచి, సమీపంలోని స్టార్‌బక్స్ వద్దకు వెళ్లి అక్కడ కూర్చుని, పోలీసులకు లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఆయుధాలు ఉన్నట్టు చెప్పినా సరే అవేమి అతని వద్ద లేవని, ఏ వివాదం లేకుండా అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అయితే ఎంత డబ్బు పోయింది అనేది మాత్రం తెలియలేదు. కాని వేలాది డాలర్లు పోయాయి అని మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసారు. వీధిలో నడుస్తున్న ప్రజలు డబ్బు తీసుకొని బ్యాంకుకు తిరిగి ఇచ్చారని సాక్షులు చెబుతున్నారు. అతని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడా లేదా అనేది తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news