భారత దేశం లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువ అయింది. దీనితో పూర్తి లాక్ డౌన్ కూడా విధించారు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. HIV రాకుండా ఉండాలంటే ఏం చేయాలి…? సెక్స్ చేయడం మానేయాలి లేదా సేఫ్ సెక్స్ చేయాలి. అంటే కాండోమ్ ని ఉపయోగించాలి.
ఎవరైతే కాండోమ్ ని ఉపయోగించి సెక్స్ చేస్తారో వాళ్లకు ఎటువంటి సమస్యలు రావు అని స్పెషలిస్ట్ చెప్పారు. మొట్ట మొదటిసారి కరోనా వైరస్ మార్చి లో గత సంవత్సరం వచ్చినపుడు సోషల్ కాంటాక్ట్ వద్దన్నారు మరియు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని చెప్పారు. అయితే మనం సోషల్ ఇంటరాక్షన్ లేకుండా ఉండలేము. ఇటువంటి సమయంలో మనకి ఉండే ఒకే ఒక ఉపాయం. అదే మాస్క్ ధరించడం అని అన్నారు.
అయితే లాక్ డౌన్ మాత్రమే పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఉపాయం కాదని వైరాలోజిస్ట్ చెప్పడం జరిగింది. అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ నుండి డాక్టర్ ఎనభైల్లో, తొంబైల్లో హెచ్ఐవి వైరస్ వస్తున్న సమయం లో ఈయన పని చేయడం జరిగింది. అయితే హెచ్ఐవి తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు జనం కాండోమ్స్ వాడడానికి సిద్ధం కాలేదు.
అలానే ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు ప్రజలు మాస్కులు ధరించడం లేదు అని అన్నారు. అయితే అప్పట్లో వాళ్ల కోసం చెప్పడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. అదే సేఫ్ సెక్స్ చేయమనడం. అదేవిధంగా ఒకవేళ కనుక ప్రజలు మాస్క్ వేసుకో పోతే వ్యాక్సిన్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం మాత్రమే ఉంది.
అలానే మరొక వైరస్ సైంటిస్ట్ పూర్తి లాక్ డౌన్ విధిస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లరని ఈ మహమ్మారిని కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. మొట్టమొదటిసారి మార్చి 24న లాక్ డౌన్ విధించినప్పుడు యాక్టివ్ కేసులు 100 కంటే తక్కువ ఉన్నాయని… ఆ తర్వాత అన్లాక్ చేయడం కారణంగా ఎక్కువ కేసులు వచ్చాయని అన్నారు అయితే పూర్తి లాక్ డౌన్ చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.