మే డే : బానిస బతుకుకి చరమ గీతం పాడిన రోజు…!

-

మే డే అంటే అంతర్జాతీయ కార్మిక సంఘ దినోత్సవం. అయితే 19వ శతాబ్దంలో పారిశ్రామిక అభివృద్ధి పొందిన యజమానులు కేవలం ధనాన్ని ధ్యేయంగా పెట్టుకుని శ్రామికుల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రతి రోజు 16 నుండి 20 గంటలు పనులు చేయించే వారు. వాళ్లని ఎంతో హీనంగా చూస్తూ… బానిస లాగ భావించి హింసించేవారు. అయితే వీటిని తట్టుకోలేక శ్రామికులు తిరగబడ్డారు.

వాళ్ల బాధలకి విముక్తి, విరామం చెప్పాలని ప్రధమంగా అమెరికాలోని ఫిలడెల్ఫియా లోని వాళ్ళ యొక్క పని గంటలని తగ్గించాలని ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1837 వ సంవత్సరంలో పది గంటల పని దినాలుని అమెరికా ప్రభుత్వం శాసన బద్దం చేసింది. ఇదిలా ఉంటే 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో పని దినాలు పరిమితంగా ఉండాలని లక్షలాది కార్మికులు సమ్మె చేయడం జరిగింది.

కాల్పులు వగైరా వంటివి కూడా ఆ రోజు జరిగాయి. మార్కెట్ తదితర ప్రాంతం అంతా కూడా రక్తం తో నిండి పోయింది. అయితే ఆరోజు కార్మిక నాయకులైన సార్సన్, స్పైన్, ఏంగెల్, ఫిషెలను దారుణంగా ఉరి తీయడం జరిగింది. అయినా సరే ఉద్యమాలు ఆగవని ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని ప్రబోధించాడు.

చికాగో అమరవీరుల సంస్మరణ దినంగా చరిత్రకెక్కిన మే 1 ఇలా మే డే గా నిలిచిపోయింది. శ్రామిక విజయానికి చిహ్నంగా రోజుకు ఎనిమిది గంటల పని చట్టబద్ధం చేయబడింది. నాటి నుండి నేటి వరకు ఈ మేడే విశ్వ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. మొట్టమొదటిసారి రష్యా లో 1991 మే 1న మార్క్సిస్టులు రహస్యంగా అంతర్జాతీయ కార్మిక సంగీభావ దినోత్సవం జరిపారు. అప్పటి నుంచి కూడా ఈ మే డే ని జరుపుకోవడం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news