కరోనా స్పెషల్ టీ రూ.10లకే..!

-

దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసందే. అయితే కరోనా ప్రభావంతో అన్ని రకాల వ్యాపారాలు డీలా పడ్డాయి. ఆఖరికి చాయ్‌ తాగేందుకు సైతం చాలామంది జంకుతున్నారు. అయితే  హన్మకొండలోని ఓ హోటల్‌ యజమాని వేడివేడి టీతో ప్రతికూల పరిస్థితులను సైతం అవకాశంగా మలుచుకుంటున్నాడు. హన్మకొండలోని రామ్‌నగర్‌లో చిరుధాన్యాలతో తయారు చేసే టిఫిన్లు విక్రయించే ధ్యాన ప్రకృతి మందిరమిది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ చేసే చాయ్‌కు డిమాండ్‌ ఎక్కువే. ఎందుకంటే ఇక్కడ అమ్మేది కరోనా స్పెషల్‌ చాయ్‌ కాబట్టి.

corona tea
corona tea

కరోనా వైరస్‌ దరిచేరకుండా ఇప్పుడు అందరూ కషాయం తాగుతున్నారు. ఇదే తన వ్యాపార సూత్రంగా మలచుకుని అల్లం, మిరియాలు, శొంఠి, దాల్చినచెక్కతో తయారు చేసిన వేడివేడి టీతో ఇక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంటున్నాడు. ఒక్కొ చాయ్‌ను రూ.10ల చొప్పున విక్రయిస్తూ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉపాధి పొందుతున్నాడు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రతతో చాయ్‌ను తయారు చేస్తున్నానని యజమాని చెబుతున్నాడు. ఈ చాయ్‌ తాగడం వలన గొంతులో ఉపశమనం కలుగుతుందని ఓరుగల్లు వాసులు చెబుతున్నారు. గతంలో 50 చాయ్‌లు అమ్మడం గగనమయ్యేదని.. కాని ఇప్పుడు రోజుకు దాదాపు 600 స్పెషల్‌ చాయ్‌లు అమ్ముతున్నట్టు హోటల్‌ యజమాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news