తుమ్మజిగురు, కరక్కాకాయ, నల్లబెల్లం, దానిమ్మ తొక్కలు..కట్ చేస్తే కాటన్ చీరలు

-

మార్కెట్ లోకి ఎన్ని రకాల ఫ్యాషన్స్ వచ్చినా.. చేనేత వస్త్రాలకు ఉండే లెవలే వేరు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ వీటిపై మగువులకు ఆసక్తి ఉంది. ఇప్పటివరకూ.. కలంకారీ చిత్రకళకు.. ఆంధ్రప్రదేశ్‌ లోని మచిలీపట్నం, శ్రీకాళహస్తి ఫేమస్.. తెలంగాణ గడ్డపై తొలిసారి నారాయణపేటలో మహిళలు ఈ నైపుణ్యంపై శిక్షణ పొందుతున్నారు. వస్త్రాలపై కలంకారీ పెయింటింగ్‌తో పాటు బ్లాక్‌ ప్రింటింగ్‌ కూడా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. నారాయణ పేట చేనేత చీరలకు పెట్టింది పేరు. ఇక్కడి మహిళలకు మగ్గాలపై పట్టు, కాటరన్ చీరలను నేయడంలో తమదైన శైలితో ముందుకెళ్తున్నారు.

కలెక్టర్ సహకారంతో..

ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవారు నారాయణపేట జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన. నాబార్డు సహకారంతో, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కలంకారీలో 60 మంది మహిళలకు 80 రోజుల పాటు హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ శిక్షణ ఇస్తోంది. బ్లాక్‌ ప్రింటింగ్‌పై 30 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు.

రంగులు అద్దే ప్రాసెస్ భలే గమ్మత్తు…

వెదురు పుల్లలకు దూది చుట్టి బ్రష్‌లా చేసుకొని.. చింతపుల్లలను కాల్చి, నల్లబెల్లం వాడుతూ, పాలు, పటిక పొడి కలిపిన ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టి, జాడించి, సబ్బునీళ్లలో ఉతికి ఆరబెడతారు. తొలిసారి చిత్రణ పూర్తయ్యాక పారుతున్న నీళ్లలో ఆరవేసినట్టుగా ఆ వస్త్రాన్ని పట్టుకుంటారు. మొదటి దశలో ఎరుపు, నలుపు రంగులను ఉపయోగిస్తారు. ఆ తర్వాత డిజైన్‌కు సంబంధించిన రంగులన్నీ ఉపయోగిస్తారు.

నాచురల్ కలర్సే..

కలంకారీ డిజైన్‌లో ప్రధానంగా వాడే నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కోసం తుమ్మజిగురు, కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కల ద్వారా తీసిన సహజమైన రంగులనే వాడుతున్నారట.

దుపట్టాలు, చీరలు, టేబుల్‌ క్లాత్స్, బ్యాగ్స్‌ పై ఈ పెయింటింగ్‌తో అందమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. కలంకారీ పెయింటింగ్, బ్లాక్‌ ప్రింటింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులు సర్టిఫికేట్‌లను అందుకోవడంతో పాటు ఈ కళలో కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఓ పక్క చదువుకుంటూ.. కూడా ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నవారు ఉన్నారు. అప్పటికే పట్టుచీరల వ్యాపారం చేస్తూ నైపుణ్యంపై పట్టు సాధించాలని ఇందులో శిక్షణ పొందే వారూ ఉన్నారు. ప్రపంచ మార్కెట్ లోకి తమ కళను అవలీలగా తీసుకెళ్లడానికి ఈ ట్రైనింగ్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇక్కడ శిక్షణ తీసుకునే మహిళలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news