మీరు డిగ్రీ పూర్తి చేసారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NGO ల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ప్రోగ్రామ్‌ని నిర్వహించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్-2022 కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా ఎంపిక చేస్తారు అనే విషయానికి వస్తే… ఈ ఫెలోషిప్‌లకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూలు. వీటి ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ప్రిలిమినరీ దరఖాస్తులో వారి పూర్తి వివరాలు, విద్యార్హతలు, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆన్‌లైన్ అసెస్‌మెంట్ స్టేజ్ ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పూర్తైన తర్వాత పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఉంటుంది. వృత్తి, వ్యక్తిగత అంశాలు వంటివి చూసి ఎంపిక చేస్తారు. విద్య, నీటి వనరులు, మహిళా సాధికారత, టెక్నాలజీ, సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్, సాంప్రదాయ కళలు, స్వయం పరిపాలన, ఆహార భద్రత, ఆరోగ్యం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవితం వంటి వాటిపై అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది.
దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022. నివాస ఖర్చుల కోసం నెలకు రూ.15,000, రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.1,000, అలవెన్సుల కింద రూ.50,000 ఉంటుంది. అలానే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://youthforindia.org/ వెబ్‌సైట్ లో పూర్తి వివరాలని చూడచ్చు.
వెబ్‌సైట్: https://www.sbi.co.in/