భారత్‌లోని ఈ ప్లేసెస్‌లో అంతుచిక్కని నిధులున్నాయట.. మీకు తెలుసా?

-

భిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు కేరాఫ్ అయిన భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. భక్తి భావనను ప్రపంచాన్ని అందించినది భారతేనని పెద్దలు చెప్తుంటారు. దేశంలో పురతాన ఆలయాలు బోలెడున్నాయి. అయితే, వీటిల్లో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పరిరక్షించేందుకు గాను ప్రభుత్వం, పురవాస్తు శాఖ చర్యలు తీసుకుంటోంది. అయితే, దేశంలో ఉన్న ఈ ఆలయాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు, నిక్షేపాలు దాగున్నాయని కొంత మంది పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. అవేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని తప్పక చదవాల్సిందే.

 

treasure | నిధులు
treasure | నిధులు

పురాతన కాలంలో భారతదేశం సంస్థానాలుగా ఉండేది. ఆ సమయంలో రాజులు ప్రత్యేక స్థావరాలు లేదా ప్రదేశాల్లో తమ నిధులును భద్రపరుచుకునేవారిన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే పలు సంస్థానాల్లో జరిపిన తవ్వకాల్లో కొన్ని అవశేషాలు బయటపడటం మనం గమనించొచ్చు. ఈ క్రమంలోనే బిహార్ రాష్ట్రంలోని సోన్ భండార్ గుహల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని కొందరి వాదన. బిహార్ స్టేట్ రాజ్‌గీర్‌ ప్రాంతంలో ఉన్న రెండు గుహల్లోనూ నిధులున్నాయట.ఈ ప్లేస్‌లోనే గౌతమ్ బుద్ధుడు మగధ రాజ్యంలోని బింబిసారాకు నీతి బోధనలు చేశాడని స్థానికులు చెప్తుంటారు.

వారి కథనం ప్రకారం..గుహల్లో బోలెడంత బంగారం ఉంది. అయితే, ఈ నిధికి సంబంధించిన అత్యంత సీక్రెట్ వే లో తలుపులు నిర్మించారట. ఆ తలుపుల తాళం చెవిలు దొరికితే నిధి దొరకుతుందని వారి భావన. కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలో నిధులు, నిక్షేపాలున్నట్లు నిర్ధారణ కూడా అయింది. కోర్టు ఆదేశం మేరకు ఈ టెంపుల్‌లోని ఓ సీక్రెట్ ప్లేస్‌ను ఓపెన్ చేశారు. అందులో శిల్పాలు, ఆభరణాలు, కిరీటాలు, గోల్డ్ ఐటమ్స్, రత్నాలు ఉండగా వాటి విలువ దాదాపు 1.3 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. హైదరాబాద్ సంస్థాన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ తన వద్ద ఉన్న భారీ సంపద తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కింగ్ కోఠి అనే ప్లేస్‌లో దాచాడాని పలువురి నమ్మకం. ఏపీలోని కృష్ణా నదిలో, రాజస్థాన్‌లోని జైగర్ కోటలోనూ విలువైన నిధులు ఉన్నాయని కొందరు పురావస్తు పరిశోధకుల అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news