టిక్ టాక్ కు దండేసి వినూత్న నిరసన

-

ఇండియాలోనే టిక్ టాక్ యాప్ ను 240 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. అంటే 24 కోట్ల మంది అన్నమాట. గూగుల్ యాపిల్ ప్రాడక్ట్స్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన యాప్ టిక్ టాక్.

అతి తక్కువ కాలంలో ఎక్కువగా పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ గురించి మీకు తెలిసిందే కదా. చైనాకు చెందిన ఈ యాప్ భారత్ లో చాలా పాపురల్ అయింది. ముఖ్యంగా యూత్ దీనికి బాగా అడిక్ట్ అయ్యారు. 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అందులో షేర్ చేసి దానికి వచ్చే లైకులు, షేర్ల ద్వారా పాపులారిటీ పొందడమే ఈ యాప్ ఉద్దేశం. అయితే.. ఈ యాప్ లో పోర్న్ కంటెంట్ అప్ లోడ్ అవుతోందని.. దీని వల్ల పిల్లలు, యూత్ చెడు దారులు తొక్కే ప్రమాదం ఉందని మద్రాస్ హైకోర్టు దాన్ని బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడంతో.. కేంద్ర ప్రభుత్వం.. గూగుల్, యాపిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

Different protest for tik tok on social media

దీంతో టిక్ టాక్ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో వినూత్న నిరసన తెలుపుతున్నారు. టిక్ టాక్ యాప్ ఫోటోకు దండేసి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇండియాలోనే టిక్ టాక్ యాప్ ను 240 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. అంటే 24 కోట్ల మంది అన్నమాట. గూగుల్ యాపిల్ ప్రాడక్ట్స్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన యాప్ టిక్ టాక్. అంతే కాదు.. ప్రపంచంలోనే ఈ యాప్ మూడో స్థానంలో ఉంది. అంత పాపులారిటీ వచ్చిన యాప్ పై ఆకస్మికంగా నిషేధం విధించడంతో… టిక్ టాక్ యూజర్లు తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇలా వాళ్ల నిరసనను తెలియజేస్తున్నారు.

ఈ యాప్ ను ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, హాంకాంగ్ లో నిషేధించారు. ఇప్పుడు ఇండియా కూడా ఆ జాబితాలో చేరింది. ఈ యాప్ ను ఇదివరకే ఇన్ స్టాల్ చేసుకున్న వాళ్లకు ఎటువంటి సమస్యా లేదు. వాళ్లు టిక్ టాక్ యాప్ ను ఉపయోగించవచ్చు. కానీ.. కొత్తగా మాత్రం డౌన్ లోడ్ చేసుకోలేరు.

Read more RELATED
Recommended to you

Latest news