రెండు తలల శిశువు జననం… చర్మం లేకుండా…!

రెగ్యులర్ చెకప్ లు అదే ఆసుపత్రిలో చేయించారు. అయితే స్కానింగ్ లో సుజాత కడుపులో రెండు తలల శిశువు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలో సుజాతకు నార్మల్ డెలివరీ చేశారు.

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లో ఉన్న ఓ హాస్పిటల్ లో రెండు తలల శిశువు జన్మించాడు. అతడు మగ శిశువు. కాకపోతే పుట్టిన కాసేపటికే ఆ శిశువు మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహేశ్, సుజాత దంపతులు… ముషీరాబాద్ లో ఉంటున్నారు. మహేశ్ డ్రైవర్ గా పని చేస్తుండగా… సుజాత గృహణి. కొన్ని నెలల కింద సుజాత గర్భం దాల్చడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని డంగోరియా మెటర్నిటీ నర్సింగ్ హామ్ లో చెక్ చేయించారు.

Male child born with two heads in hyderabad

తర్వాత రెగ్యులర్ చెకప్ లు అదే ఆసుపత్రిలో చేయించారు. అయితే స్కానింగ్ లో సుజాత కడుపులో రెండు తలల శిశువు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో డాక్టర్ల పర్యవేక్షణలో సుజాతకు నార్మల్ డెలివరీ చేశారు. అయితే ఆ శిశువు రెండు తలలతో పైన చర్మం లేకుండా పుట్టాడు. పుట్టిన కాసేపటికే ఆ శిశువు మరణించాడు. ఇలాంటి కేసులు చాలా అరుదని… జన్యుపరమైన లోపాల వల్ల ఇటువంటి పిల్లలు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు.