సాధారణంగా ఒకరిలో ప్రేమ పుడుతుంది కానీ ఇద్దరిలో కూడా ప్రేమ పుట్టాలన్నా ఇద్దరూ కలిసి జీవించాలన్నా కూడా కొంచెం కష్టం. కొందరు మగవాళ్లు అయితే ఆడవాళ్ళతో మాట్లాడడానికి చాలా తొందర పడుతూ ఉంటారు. అయితే అందరు అమ్మాయిలు కూడా అంత త్వరగా అంగీకరించరు. చాలా విషయాలను గమనించి అప్పుడు మాత్రమే ఇష్టపడతారు ఆడవాళ్ళు.
అందుకని వాళ్ళు అన్ని విషయాల్లో కూడా గమనిస్తూ ఉంటారు. మగవారిలో మంచి లక్షణాలు ఉండి ప్రేమ కనపడితే అప్పుడు మాత్రమే వాళ్ళు రిలేషన్ షిప్ కి అంగీకరిస్తారు. అయితే అమ్మాయిలతో స్నేహం చేయడం కొంచెం ఈజీనే. కానీ ప్రయత్నించాలి.
వాళ్ళని ఎప్పుడూ సంతోష పెడుతూ నవ్విస్తూ ఉండాలి. సరదాగా కబుర్లు చెప్తూ ఉండాలి. వాళ్లు ఏ విషయంలో కూడా బోర్ ఫీలవకుండా ఉండేటట్టు చూసుకోవాలి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది చాలా సులువైన పని అని దీని కోసం పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేదు అని తెలుస్తోంది.
నిజంగా అమ్మాయి మీతో స్నేహాన్ని కోరుకుంది అంటే ఆమె కళ్ళు జవాబు చెప్పేస్తుంటాయి. మీలో మంచి గుణాలని ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు మీపై ఒక అంచనా వేస్తారు. మీలో మంచితనాన్ని కూడా గుర్తించగలుగుతారు.
ఆ తర్వాత మాత్రమే మీకు క్లోజ్ గా ఉంటారు. అయితే దీనికోసం అబ్బాయిలు తమ జీవితాలను త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు మంచి మనసు ఉన్న వాళ్ళని ఇష్టపడతారు. వాళ్లలో చెడు ఎక్కువ కనబడితే మాత్రం దూరం పెట్టేస్తారు. అందుకనే మీరు ఎవరినైనా ముగ్గులోకి దింపాలి అంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.