స్పేస్ లో వ్యోమగాములు తలస్నానం ఎలా చేస్తారో తెలుసా..?

మనం ఎలా అయితే భూమ్మీద ఉంటామొ.. అలా స్పేస్ లో ఉండడం అవ్వదు. మనం భూమి మీద చేసే సులువైన పనులని అక్కడ మైక్రో గ్రావిటీ మీద చేయడం అంత సులభం కాదు. అయితే అక్కడ ఎలా తల స్నానం చేస్తారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అవునండి ఇక్కడ చేసినట్లు అక్కడ చేయడం కుదరదు. అయితే మరి అక్కడ ఉండే వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారు అనే ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

స్పేస్ లో ఎలా తల స్నానం చేస్తారు అనే వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. చాలా మంది ఈ వీడియోని చూశారు. ఒక వ్యోమగామి స్పేస్ స్టేషన్ లో ఎలా తలస్నానం చేస్తారు అనే దానిని పోస్ట్ చేశారు. ఇక దాని కోసం చూసేస్తే.. స్పేస్ లో తలస్నానం చేసేటప్పుడు నో రిన్స్ షాంపూని వాళ్ళు వాడతారు.

నీళ్లు ఎటూ పోకుండా టవల్ని కూడా ఆమె సిద్ధం చేసుకున్నారు. కొద్దిగా నీళ్లు వేసి ఆ షాంపూ వేసి తువ్వాలు అడ్డు పెట్టుకున్నారు. తల అంతా కూడా దానిని పట్టించారు. అయినప్పటికీ తలలో ఇంకా నీళ్ళు ఉండిపోవడం వల్ల ఆమె దువ్వెనతో మరొకసారి దువ్వారు. మనం గాలిలో ఆ నీళ్లు ఎగరడాన్ని కూడా చూడొచ్చు. ఆ తరువాత మిగిలిన తడిని తువ్వాలుతో తుడిచారు.