ఫ్రిడ్జ్‌లో ఈ ఫ్రూట్స్‌ పెడితే.. ప్రాణాంతకం అవుతాయి తెలుసా..?

-

fridge: అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌ ఉంటుంది. ఇక ఆ ఫ్రిడ్జ్‌లో ఏది పడితే అది పెట్టేస్తాం. మిగిలిపోయిన కూరలు, వాడపోయిన కూరగాయలు, పండ్లు, రసాలు..అబ్బో కొంతమంది ఫ్రిడ్జ్‌లు అయితే ఆగం ఆగం ఉంటాయి. అసలే ఇది సమ్మర్‌..కూల్‌ వాటర్‌, ఫ్రూడ్స్‌ తినడం కామన్.. కానీ ఫ్రిడ్జ్‌లో కొన్ని ఫ్రూడ్స్‌ పెట్టకూడదు. వీటిని తినడం వల్ల..వచ్చే ఆరోగ్యం కన్నా.. జరిగే నష్టమే ఎక్కువ.. రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే హానికరమైన అనేక పండ్లు ఉన్నాయి. ఫ్రిజ్‌లో ఏ పండ్లను అస్సలు ఉంచకూడదో తెలుసుకుందాం –

 

fridge
fridge

పుచ్చకాయ– పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తినకూడదు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు దానిలోని పోషకాలు నెమ్మదిగా తగ్గుతాయి. పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచితే ఫుడ్ పాయిజన్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా కోసిన పుచ్చకాయలో పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎప్పుడూ పుచ్చకాయను తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టకండి.

నారింజ – నారింజలో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ యాసిడ్ లాంటి పదార్థం రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనానికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వెంటనే పోషకాలను కోల్పోవడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఏదైనా సిట్రస్ పండ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు.. అవసరమైతే చల్లటి నీటిలో వేయవచ్చు. ఒక నివేదిక ప్రకారం.. ఆప్రికాట్లు, ఆసియా పియర్స్, అవకాడోస్, అరటిపండ్లు, జామ, కివీస్, మామిడి, పుచ్చకాయలు, బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్స్, పీచెస్, బేరి, ఖర్జూరం, రేగు పండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు.

ఎందుకంటే ఈ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే వాటి గుణాలు కోల్పోతాయి. మామిడి పండ్లను ఎక్కువ సేపు రిఫ్రిజిరేటర్ లో ఉంచితే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గి పోషక విలువలు కూడా తగ్గుతాయి.

చాలామందికి.. తినే వాటిపైన, తాగే వాటిపైన సరైన అవగాహన ఉండదు. తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఆహారాలు కడుపునింపేవే అయినప్పటికీ.. అన్నీ మంచివి కావు. కొన్ని ఫుడ్‌ కాంబినేషన్లు కూడా అంతే డేంజర్‌.. పాలుగుడ్లు, చాయ్‌ బిస్కెట్లు ఇలా చాలా ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news