ట్రెయిన్ చివరి బోగీ వెనుక ‘ఎక్స్’ అని పెద్దగా ఎందుకు రాస్తారో తెలుసా?

-

ఎక్స్ సింబల్ ను కొన్ని ట్రెయిన్లకు పసుపు రంగులో రాస్తే.. మరి కొన్ని ట్రెయిన్లకు తెలుపు కలర్లలో రాస్తారు. ఎక్స్ అనే క్రాస్ మార్క్ బోగీకి రాసి ఉంది అంటే.. ఆ ట్రెయిన్ కు అదే చివరి బోగీ అన్నమాట.

చిన్నప్పటి నుంచి మీరు ఎన్నోసార్లు రైలు ఎక్కే ఉంటారు. కానీ… ఏనాడైనా ట్రెయిన్ చివరి బోగీ వెనుక ఎక్స్ అనే సింబల్ ఎందుకు రాస్తారో తెలుసుకున్నారా? అసలు.. ట్రెయిన్ వెనుక ఎక్స్ అనే సింబల్ ను ఎప్పుడైనా చూశారా? పెద్దగా ఇంగ్లీష్ లెటర్ X ను రాస్తారు చివరి బోగీ వెనుక. ప్రతి ట్రెయిన్ వెనుక ఖచ్చితంగా ఈ సింబల్ ఉంటుంది. ఏదో వెనుక ఖాళీగా ఉంది కదా అని ఆ సింబల్ రాస్తారనుకునేరు. దాని వెనుక పెద్ద మర్మమే ఉంది. అదేంటో ఇవాళ తెలుసుకుందాం పదండి..

ఎక్స్ అనే సింబల్ ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను నివారించడం. ఎక్స్ సింబల్ ను కొన్ని ట్రెయిన్లకు పసుపు రంగులో రాస్తే.. మరి కొన్ని ట్రెయిన్లకు తెలుపు కలర్లలో రాస్తారు. ఎక్స్ అనే క్రాస్ మార్క్ బోగీకి రాసి ఉంది అంటే.. ఆ ట్రెయిన్ కు అదే చివరి బోగీ అన్నమాట. ఏదైనా వెళ్తున్నప్పుడు ట్రెయిన్ వెనుక బోగీకి ఈ క్రాస్ మార్క్ కనిపించలేదంటే సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అని అనుకోవాలి. అంటే ఆ ట్రెయిన్ బోగీలు విడిపోయాయి ఉంటాయిని గ్రహించాలి. రైల్వే అధికారులు.. వెనుక బోగీకి ఎక్స్ మార్క్ లేకపోతే.. బోగీలు విడిపోయాయని వెంటనే అప్రమత్తం అవుతారు. లేకపోతే.. వెనుక వచ్చే ట్రెయిన్ వాటిని ఢీకొనే ప్రమాదం ఉంటుంది.

వెంటనే అలర్ట్ అయి ప్రమాదాలు కాకుండా కాపాడుతారు. రాత్రి పూట ఎక్స్ మార్క్ కనిపించేలా.. దాని కింద ఎర్రటి లైట్ ఉంటుంది. ఆ లైట్ రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. దాని వెలుగులో ఎక్స్ మార్క్ కనిపిస్తుంది. అలా.. ఎక్స్ మార్క్ ట్రెయిన్ ను ప్రమాదాల నుంచి తప్పిస్తుందన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news