కుర్చీలో కుర్చోనే తరచూ నిద్రపోతున్నారా..? ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట..!

ఆఫీస్ లో చాలాసార్లు మధ్యాహ్నం టైంలోనే లేదా, నైట్ షిఫ్ట్స్ లో కుర్చీలోనే ఓ కునుకు తీస్తుంటాం. ఇంకా స్కూల్లో పిల్లలకు కూడా ఛైర్ లో కుర్చుని నిద్రపోయి టీచర్ ముందు బుక్ అయి ఉంటారు. ఇంకా మెట్రోలో కూడా అలా సీట్ దొరికిందంటే ఎందుకో తెలియదు చిన్న కునుకు వేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ అలా తరచూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది కాదంట. అలా పడుకోవటం ఆ క్షణానికి ఆనందాన్ని ఇస్తుంది కానీ తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. తీవ్రమైన బ్యాక్ పెయిన్, మెడ, భుజాల నొప్పి వస్తాయి. ఒకే చోట గంటలతరబడి ఉండటం, కుర్చోటం, నిల్చోవటం జంతువుల వల్ల అవుతుందని మనుషులకు అది కుదరదు. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా ఇలా కుర్చిలో కుర్చోని నిద్రపోవటమే కారణం అవుతుంది.

కూర్చొని నిద్రపోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు

మంచం మీద మనం పడుకున్నప్పుడు మన చేతులు, కాళ్లలోని కండరాలు సాగి విశ్రాంతి ఉంటాయి. అదే కూర్చొని నిద్రపోతే అది రక్త ప్రసరణను మందగింపజేస్తుంది, కదలికలను నియంత్రిస్తుంది. వీటితో కొత్త సమస్యలు వస్తాయి.

మరణానికి కూడా దారితీయవచ్చు

కూర్చొని నిద్రపోవడం వల్ల స్వల్పకాలిక సమస్యలతో పాటు డీప్‌ వీన్‌ థ్రోంబోసిస్‌ అంటే రక్తం గడ్డకట్టడం వంటివి మన శరీరంలో ముఖ్యంగా కాళ్లలో ఏర్పడుతుంది. ఎలాంటి కదలికలు లేకుండా ఒక వైపు పడుకోవడం లేదా ఎక్కువ సమయం పాటు కూర్చొని నిద్రపోవడం వలన ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుందని వైద్యనిపుణలు చెబుతున్నారు. ఈ పరిస్థితిని పట్టించుకోకుండా వదిలిస్తే అది తీవ్రమై కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చు.
రక్తం గడ్డకట్టుకొని అది పగిలిపోయినప్పుడు అది వేగంగా ఊపిరితిత్తులు, మెదడుకు చేరి తీవ్రమైన నష్టాన్ని కలిగించడమే కాదు మరణానికి దారితీయొచ్చు. రక్తం గడ్డకట్టడం అనే పరిస్థితి కారణంగా ప్రతీ రోజు 200 మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి 25 ఏళ్ల వారిలోనూ ఏర్పడవచ్చు, 85 ఏళ్ల వయస్సు వారిలోనూ రావచ్చు.

డీప్‌ వీన్‌ థ్రోంబోసిస్‌ లక్షణాలు

మడమ, పాదం, పిక్కలు వాయడం, నొప్పి.. వాపు కారణంగా చర్మం ఎర్రబారడం, వేడిగా అవడం జరుగుతుంది. హఠాత్తుగా పాదం, మడమ నొప్పి వంటివి దీని లక్షణాలుగా చెప్పవచ్చు.
ఇది సంగతి..మీలో ఎ‌వరికైనా ఇలా ఛైర్ లో కుర్చోని నిద్రపోయే అలవాటుంటే దానిని మానేయటానికి ప్రయత్నించండి. అంతేకాదు..మీ ఆత్మియులకు ఈ సమస్య ఉంటే వెంటనే షేర్ చేసేయండి.
–Triveni Buskarowthu