ఉన్నత విద్యపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం విద్యపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లిష్ ను మెరుగుపరచడం పై దృష్టిపెట్టాలని… బేసిక్ ఇంగ్లిషును తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని… వచ్చే నాలుగేళ్లపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో టెక్ట్స్ బుక్స్ అందించాలని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ నిరంతరం కొనసాగాలని… కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలని ఆదేశించారు. విద్యాపరంగా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటన్నది కనిపించాలన్నారు.
ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీ పడొద్దని… ప్రమాణాలు లేని కాలేజీల అనుమతులు రద్దని స్పష్టం చేశారు. గ్రామ, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలని వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడం పై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండాలని… ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టంచేయాలన్నారు.