జున్ను అంటే ఇష్టంలేదా..? ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

-

జున్ను: జున్ను అంటే.. ఇష్టపడని వాళ్లు అసలు ఉండరేమో కదా..! పల్లెటూర్లలలో సాధార‌ణంగా ఆవులు లేదా గేదెలు ప్ర‌స‌వించిన‌ప్పుడు జున్ను పాలు వ‌స్తుంటాయి.జున్ను పాల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆ పాల‌లో చ‌క్కెర లేదా బెల్లం క‌లిపి ఉడికించి త‌యారు చేస్తారు. అబ్బా ఆ రుచి ఉంటది.. నెక్ట్స్‌ లెవల్‌ ఉంటుంది. సిటీల్లో అయితే తోపుడు బళ్ల మీద అమ్ముతారు కానీ.. ఆ రుచి కంటే.. ఊర్లల్లో దొరికేది మస్త్‌ ఉంటుంది. అయితే జున్ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌శువులు ప్ర‌స‌వించిన‌ప్పుడు వ‌చ్చే పాలల్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన జున్ను పాలు. వాటిని తాగ‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. సాధార‌ణంగా మ‌నం తాగే పాల క‌న్నా జున్ను పాల‌లో పోష‌కాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందువ‌ల్ల వాటితో పోష‌ణ, శ‌క్తి ల‌భిస్తాయి. అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన‌వి క‌నుక మ‌నం ఆరోగ్యంగా ఉంటాం.

మ‌న శ‌రీరంలో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండేందుకు మంచి బాక్టీరియా దోహ‌దం చేస్తుంది. జున్ను పాల‌లో ఆ బాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంది. ఆ పాల‌ను తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

జున్ను పాల‌ను తాగ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

జున్ను పాల‌లో సాధార‌ణ పాల క‌న్నా కాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా, బ‌లంగా మారుతాయి.

జున్నులో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌క్కెర వ‌ద్ద‌నుకునేవారు తేనె క‌లుపుకోవ‌చ్చు. అలాగే కొద్దిగా మిరియాల పొడి, యాల‌కుల పొడి క‌లుపుకుని జున్ను తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

జున్ను విరేచననాలు, మలబద్దక సమస్యలను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కొంతమందికి జున్ను తినే వీలు ఉన్నా.. ఎక్కువగా తినరు.. ఏం తింటాంలే అని లైట్‌ తీసుకుంటారు. కానీ మీకు జున్ను దొరికితే మాత్రం కచ్చితంగా తినండి.

Read more RELATED
Recommended to you

Latest news