కర్ణాటక ఎన్నికలలో బీజేపీ పై ఏర్పడిన వ్యతిరేకత కాంగ్రెస్ కు ప్లస్ గా మారి.. ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్రానికి సీఎం గా ఎవరిని ప్రకటించాలి అన్న విషయం ఇప్పుడు హై కమాండ్ కు చుక్కలు చూపిస్తోంది. ఈ రేసులో ఉన్నది మాజీ సీఎం సిద్దరామయ్య కాగా, మరొకరు తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను వణికించే డీకే శివ కుమార్. ఇప్పుడు ఎవరిని సీఎం చెయ్యాలో…ప్లస్ లు మైనస్ లు ఏమిటో ఆలోచించుకుంటోంది కాంగ్రెస్ హై కమాండ్. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ మరియు కేసీ వేణుగోపాల్ లు సిద్ధరామయ్యకు మద్దతు తెలుపుతుండగా, ప్రియాంక గాంధీ మాత్రం డీకే శివ కుమార్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఇక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు ఎంపీ రణదీప్ సూర్జేవాలా లు తటస్తంగా ఉన్నారు. కాగా సిద్దరామయ్య ఒకడుగు ముందు వేసి అయిదు సంవత్సరాల పాలనా కాలంలో చెరో రెండున్నరేళ్లు సీఎంగా చేద్దామని ప్రతిపాదనను తీసుకొచ్చారట. ఇందుకు డీకే సుముఖంగా లేరట. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో చూడాలి.