ప్లాస్టిక్.. ప్రపంచానికి పట్టిన పెద్ద గండం. నిజానికి ప్లాస్టిక్ మొదటగా కనుక్కున్నప్పుడు ప్రపంచమంతా చాలా ఆనందంతో గెంతులు వేసింది. కానీ దాన్ని వాడాల్సినట్లుగా వాడకుండా ఎలా పడితే అలా వాడి, చివరికి ప్లాస్టిక్ ని నిషేధించే స్థాయికి వచ్చేసాం. ప్లాస్టిక్ భూమిని కలుషితం చేస్తుందని అంటున్నారు. కానీ భూమిని కలుషితం చేస్తున్నది ప్లాస్టిక్ కాదు. ప్లాస్టిక్ ని ఎలా వాడాలో తెలియని మనిషి, భూమిని పాడుచేస్తూ దానికి కారణం ప్లాస్టిక్ అని చెబుతున్నాడు. ఐతే ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువుల్లో వేటిని ఎక్కువగా వాడకూడదో తెలుసుకుందాం.
రీసైకిల్ కానటువంటి, రీసైకిల్ కి ఇవ్వలేనటువంటి డిస్పోజబుల్స్ ఏమిటో తెలుసుకుని అప్రమత్తంగా ఉంటే కొంతలో కొంత ప్లాస్టిక్ ద్వారా భూమిని కలుషితం చేయని వాళ్ళం అవుతాం కదా..
పేపర్ ప్లేట్స్
పేపర్ ప్లేట్స్ వాడకం పూర్తిగా తగ్గించాలి. పింగాణీ పాత్రల్లో తింటే బెటర్. పేపర్ ప్లేట్స్ లో తినగానే దాన్ని చెత్తలో పడవేస్తారు. దానివల్ల అది రీసైకిల్ అవకుండా పోతుంది.
కాఫీ కప్పులు
కాఫీ కప్పులని పడవేయడం చాలా కామన్. మనకి తెలియకుండానే ప్లాస్టిక్ కాఫీ కప్పులు మనల్ని ముంచేస్తున్నాయి.
స్ట్రా
ఒకే కూల్ డ్రింక్స్ లో రెండు స్ట్రాలు పెట్టుకుని తాగితే ప్రేమికులకి ఆనందం వస్తుందేమో గానీ, ఎక్కువ స్టాలు వాడుతుంటే మాత్రం భూమి మీద కాలుష్యం పెరుగుతుంది. స్ట్రా లాంటి చిన్న చిన్న వస్తువల వల్లే భూ కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది.
అహారాన్ని ప్యాక్ చేసే ప్యాకెట్లు
వీటికి బదులు స్టీల్ పాత్రలు వాడడం బెటర్. తక్కువ ఖర్చు అని చెప్పి వాడుతూ పోతుంటే రేపటి రోజున వెలకట్టలేని నష్టం ముందు కూర్చుంటుంది.
కూరగాయల సంచులు
మార్కెట్ కి కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిన ప్రతిసారీ ప్లాస్టిక్ సంచిన ఇంటికి తీసుకొచ్చి, ఎక్కడో పాడేస్తాం. అలా మీరొక్కరే కాదు ప్రతీ ఒక్కరూ. అలా ప్రతి ఒక్కరూ పడవేసిన ప్లాస్టిక్ మొత్తం భూమి మీదే ఉంటుంది. అంటే ఏ రేంజిలో కాలుష్యం జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి.