పేదల కోసం ఉజ్వల 2.0.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

-

పావర్టీ లైన్ కి దిగువన ఉన్నవారికి ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు 2016లో మొదలైన ఈ పథకం ఎంతో మంది సామాన్యుల ఇళ్ళల్లో వెలుగులు నింపింది. మొత్తం 5కోట్ల లబ్దిదారులకు ఉజ్వల సేవలు లభించాయి. వంట ఇళ్ళలో గ్యాస్ సిలిండర్లు లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను అందించడం ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఐతే ప్రస్తుతం ఈ పథకానికి మరో వెర్షన్ రాబోతుంది.

ఉజ్వల 2.0పేరుతో ప్రధాని లాంచ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉజ్వల 2.0ని ప్రారంభిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఉజ్వల 1.0 పథకంలో లబ్దిదారులుగా లేని వారు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మహోబా ప్రాంతంలో ఈ పథకం లాంచ్ కాబోతుంది. ఈ పథకం ద్వారా మరో కోటి మంది ఇళ్ళల్లో వెలుగులు నిండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news