డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా…? అయితే రూ.5 వేల జరిమానా పడొచ్చు…!

-

ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఎంతో ఈజీగా గూగుల్ మ్యాప్స్ సహాయం తో ఎక్కడకి కావాలన్న వెళ్లిపోతున్నారు. మీరు కూడా గూగుల్ మ్యాప్ వాడుతుంటారా? అయితే తప్పక మీకు ఈ విషయాలు తెలియాలి. దీనితో జాగ్రత్తగా ఉండండి. లేదంటే జరిమానా పడొచ్చు. బైక్ లేదా కారు నడిపేటప్పుడు గూగుల్ మ్యాప్ వాడితే భారీ జరిమానా పడుతుందిట. అదేంటి గూగుల్ మ్యాప్స్ వలన కూడా జరిమానా పడుతుందా అని ఆశ్చర్య పోతున్నారా..? అవును ఈ తప్పు చేస్తే తప్పకుండ పడుతుంది.

ఇక దీని కోసం పూర్తిగా చూస్తే.. దారి తెలుసుకోవడానికి, కొత్త చోట్లని చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మామూలుగా మనం డ్రైవ్ చేసుకుంటూ గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అయిపోతాం. కానీ అది కొత్త తప్పే. ఎందుకంటే టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ చూస్తూ వెహికల్ నడిపితే మాత్రం భారీగా ట్రాఫిక్ పోలీసులు చలానా వేసే ఛాన్స్ ఉంది.

కారు లేదా బైక్ డ్రైవ్ చేసే వారు వారి వెహికల్‌కు మొబైల్ హోల్డర్‌ను ఏర్పాటు చేసుకుంటే బెస్ట్. చేతి తో పట్టుకోకుండా హోల్డర్‌కు స్మార్ట్ ‌ఫోన్ పెట్టి దారి చూసుకుంటూ వెళ్లొచ్చు. పైగా ఈ పద్దతి ఈజీ కూడా. కనుక మీరు హోల్డర్ ని ఏర్పాటు చేసుకోండి. లేదంటే మీకు డ్రైవింగు కష్టమే. అలానే ఈ చలానా పడితే కట్టాలి కూడా.

 

Read more RELATED
Recommended to you

Latest news