ప్రస్తుతం కాలంలో ఆందోళన అనేది చాలా సాధారణం అయిపోయింది. ఇంట్లో, ఆఫీసులో, బయటా.. ఇలా ఎక్కడ చూసినా ఆందోళనతో బాధపడే మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. ఐతే దానికి చాలా కారణాలున్నాయి. మనం అనుకున్నది జరగట్లేదని బాధపడడం, ఆఫీసులో రాజకీయాలు, ఇతరులతో పోల్చుకుని ఇబ్బంది పడడం సహా చాలా విషయాల్లో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలా ఆందోళన చెందడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని కారణంగా అనేక ఇతర సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతుంతాయి.
ఆందోళన కలిగినపుడు దాన్ని తగ్గించుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి. చాలా మంది ఆందోళనలో ఉన్నప్పుడు ఏది పడితే అది తింటుంటారు. దానివల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. అలా కాకుండా సరైన ఆహారాన్ని తీసుకుని ఆందోళనని అదుపులో ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.
సిట్రస్ ఫలాలు
సిట్రస్ ఫలాలని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆందోళనని తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
మెగ్నీషియం కలిగిన ఆహారాలు..
మెగ్నీషియం కలిగిన ఆహారాలని తీసుకోవడం వల్ల మెదడులో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, ఆందోళనని తగ్గిస్తాయి. ఆకు కూరలని ఆహారంగా తీసుకుంటే మెగ్నీషియం శరీరానికి అందుతుంది. అవొకోడో, అరటి పండు వంటి వాటిల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
జింక్ అధికంగా గల ఆహారాలు
జింక్ అధికంగా గల ఆహారాలైన కాజు, గుడ్లు మొదలైన వాటిని తీసుకుంటే ఆందోళన నుండి బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకి కీలక ఖనిజమైన జింక్ ని ఆహారంగా తీసుకుంటే, ఆందోళన నుండి తప్పించుకోవచ్చు.